ఏపీ ప్రభుత్వం తీరుపై మరోసారి నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. వర్చువలుగా టీడీపీ పార్లమెంట్ పార్టీ సమావేశం నిర్వహించారు. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీపీ భేటీలో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అస్తవ్యస్థ విధానాలపై కేంద్రం దృష్టి పెట్టాలి.ఆర్థిక ఉల్లంఘనలతో రాష్ట్ర భవిష్యత్ అంధకారంలోకి వెళ్లింది.
ఏపీలో జరుగుతోన్న పరిణామాలపై కేంద్రం జోక్యం చేసుకోవాలి.వైసీపీకి చెందిన 28 మంది ఎంపీలు ఉండి 32 నెలల్లో రాష్ట్రానికి ఏం తెచ్చారు..?పాలన అంటే అప్పులు చెయ్యడం, దోచుకోవడం అన్నట్టుగా మారిపోయింది.రాష్ట్ర ప్రభుత్వ అక్రమాలు, రాష్ట్రంలో ఉన్న దారుణ పరిస్థితులపై కేంద్రం జోక్యం చేసుకోవాలి.రాష్ట్రంలో అనేక సమస్యలు ఉంటే.. ఇప్పటికిప్పుడు కొత్త జిల్లాలు అంటూ వైసీపీ ప్రభుత్వం కొత్త డ్రామా ఆడుతోంది.
ఉద్యోగుల పిఆర్సీతో పాటు.. రాష్ట్రంలోని ఇతర సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే ఈ డ్రామా.28 మంది వైసిపి ఎంపీలు రాష్ట్రం కోసం ఏం సాధించారు…? అని చంద్రబాబు ప్రశ్నించారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలు ఎవరి కోసం..? రాష్ట్ర ప్రభుత్వ సమస్యలు, విభజన హామీలు, పెండింగ్ అంశాలపై టీడీపీ పోరాటం చేస్తుందన్నారు చంద్రబాబు.