ఏపీలో వినోదం ప్రజలకు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం టికెట్ల రేట్లపై హేతుబద్ధత తీసుకురావాలని భావిస్తోంది. అందులో భాగంగా కమిటీ ఏర్పాటుచేసింది. ఇటీవల చిరంజీవి, మహేష్ బాబు, రాజమౌళి, ప్రభాస్ సీఎం జగన్ తో చర్చించిన సంగతి తెలిసిందే. టికెట్ల వివాదానికి ఫుల్ స్టాప్ పడే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం విధానాలను ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ లో వివరించారు మంత్రి పేర్ని నాని. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు సినిమాల్లో కానీ,…
ఏపీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు. మొన్న అర్థరాత్రి టెర్రరిస్టులను అరెస్టు చేసినట్లు అశోక్ బాబును నోటీసు తగిలించి సీఐడీ అధికారులు కిడ్నాప్ చేశారు. విచారణ పూర్తైన ఆరోపణలపై మళ్లీ కేసు నమోదు చేశారు. జగన్ ఉన్మాది ముఖ్యమంత్రి మొదటి ఎఫ్.ఐ.ఆర్.కు సెక్షన్లు ఎందుకు మార్చారు. అశోక్ బాబును అరెస్టు చేసి ఏం విచారణ చేశారు.రాష్ట్రంలో చట్టప్రకారం పాలన జరగాలి.పోలీసులు కూడా చట్టప్రకారమే వ్యవహరించాలి.లేకపోతే ప్రైవేటు కేసులు వేస్తాం.ప్రజలకు…
ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స కుమారుడి వివాహం హైదరాబాద్‌లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ఏపీ సీఎం జగన్ సతీసమేతంగా హాజరయ్యారు. ఈ మేరకు సీఎం జగన్ దంపతులు వరుడు డాక్టర్ లక్ష్మీనారాయణ్ సందీప్, వధువు పూజితలను ఆశీర్వదించారు. అటు ఈ వివాహానికి టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ కూడా వచ్చారు. ఆయనను మంత్రి బొత్స కుటుంబ సభ్యులు సాదరంగా ఆహ్వానించారు. మరోవైపు ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవితో…
ఏపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి విమర్శలు చేశారు. జగన్ సీఎం అయ్యాక అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని.. అప్పు చేయకపోతే ప్రభుత్వ ఖజానా ఖాళీ అయ్యే స్థాయికి తీసుకువచ్చారని మండిపడ్డారు. 2009 నాటికి ఏపీ అప్పు 3,14,000 వేల కోట్లుగా ఉంటే.. ప్రస్తుతం ఏపీ అప్పు రూ.7లక్షల కోట్లకు చేరిందన్నారు. రాష్ట్రంలోని ఆస్తులన్నీ ఒక్కొక్కటిగా అమ్మేస్తున్నారని.. చివరకు విజయవాడలో పార్కును కూడా తాకట్టు పెట్టే స్థాయికి వచ్చారని ఎద్దేవా…
ఏపీలో జగన్ మోహన్ రెడ్డి పాలనలో కీలక మార్పులు రానున్నాయా? కేబినెట్లో మార్పులు, చేర్పులకు రంగం రెడీ అయిందా? ముహూర్తం కూడా పెట్టేశారా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. జగన్ తన టీంలో పెను మార్పులకు సిద్ధం అవుతున్నట్టు తాడేపల్లి నుంచి సమాచారం అందుతోంది. మొదట మంత్రివర్గ ప్రక్షాళన, ఆతర్వాత పార్టీ ప్రక్షాళన చేస్తారని తెలుస్తోంది. ఇదంతా పూర్తయ్యాక అధికారుల ప్రక్షాళన వైపు జగన్ అడుగులు వేస్తారని భావిస్తున్నారు. చివరలో తన కుటుంబానికి సంబంధించి అతి కీలక…
ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి పూనుకున్న హీరోలందరికీ ప్రముఖ నిర్మాత కె. ఎస్. రామారావు అభినందనలు తెలిపారు. గురువారం సినిమా రంగానికి చెందిన అగ్ర కథానాయకులు, దర్శక నిర్మాతలు ఏపీ సీఎం జగన్ ను కలిసి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఓ పరిష్కారం కనుగొనడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుండి ఏపీకి ప్రత్యేకంగా వెళ్ళి ప్రాక్టికల్ ముఖ్యమంత్రి అనిపించుకున్న జగన్ మోహన్ రెడ్డిని కలిసి, చిరకాల సమస్యలకు ఫుల్…
ఎట్టకేలకు సీఎం జగన్ తో టాలీవుడ్ బృందం భేటీ ముగిసింది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్ పరిశ్రమ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్టుగా కన్పిస్తోంది. తాజాగా టాలీవుడ్ నుంచి చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, అలీ, పోసాని, నిర్మాత నిరంజన్ రెడ్డి లాంటి పలువురు సినీ ప్రముఖులు సీఎంతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సినీ పెద్దలంతా కలిసి సినిమా టికెట్ ధరలు, ఇండస్ట్రీ సమస్యలపై చర్చించారు.…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో టాలీవుడ్ హైప్రొఫైల్ భేటీకి రంగం సిద్ధమైంది. చిరంజీవి నేతృత్వంలోని టాలీవుడ్ బృందం ఈరోజు జగన్‌ను కలవడానికి బయల్దేరారు. టాలీవుడ్ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సమావేశానికి చిరంజీవితో పాటు తెలుగు సూపర్ స్టార్లు ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రాజమౌళి, కొరటాల శివ, అలీతో పాటు మొత్తం 9 మంది హాజరు కాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్ ధరలపై, ఇండస్ట్రీలోని పలు సమస్యలపై ఈ భేటీలో…