ఏపీలో సహకార శాఖపై సీఎం జగన్ సమీక్ష జరిపారు. క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి రాష్ట్రంలో జిల్లా, కేంద్ర సహకార బ్యాంకుల పనితీరు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పని తీరును సమీక్షించారు. కంప్యూటరైజేషన్, పారదర్శక విధానాలు, ఆర్బీకేలతో అనుసంధానం తదితర అంశాలపై కీలక చర్చ జరిగింది. సహకార బ్యాంకులు మన బ్యాంకులు, వాటిని మనం కాపాడుకోవాలి. తక్కువ వడ్డీలకు రుణాలు వస్తాయి, దీనివల్ల ప్రజలకు, రైతులకు మేలు జరుగుతుంది. వెసులుబాటు ఉన్నంత…
ఏపీ పాలనపై ఫోకస్ పెట్టిన జగన్ అందులో భాగంగా పోలీస్ బాస్ ని మార్చారు. డీజీపీగా వున్న గౌతమ్ సవాంగ్ ని బదిలీ చేశారు. కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీకి నియమించిన సంగతి తెలిసిందే. ఇవాళ డీజీపీగా బాధ్యతలు తీసుకోనున్నారు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి. మంగళగిరిలోని పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఉదయం 9 గంటలకు బాధ్యతలు తీసుకోనున్నారు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి. అనంతరం పాత డీజీపీ గౌతమ్ సవాంగ్ కు ఘనంగా వీడ్కోలు వేడుక నిర్వహిస్తారు.…
జగన్ మూడేళ్ల పాలనలో రాష్ట్రంలో మునుపెన్నడూ లేని ఆర్దిక సంక్షోభం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు. సీఎం జగన్ అహంభావం, చేతగానితనం, మొండితనంతోనే ఈ అనర్ధం ఏర్పడిందన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిపై ప్రభుత్వం నిజాలను తొక్కి పెడుతోంది. బహిరంగ మార్కెట్ రుణాలతో సహా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 3 ఏళ్లలో టీడీపీ హయాం కంటే రూ 86,865 కోట్లు అధికం.కేంద్ర నిధులు కూడా కలిపితే రాష్ట్ర…
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గురువారం నాడు విజయవాడలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. బెంజి సర్కిల్ రెండో ఫ్లైఓవర్ ను ప్రారంభించారు. పర్యటన అనంతరం నితిన్ గడ్కరీ తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని సీఎం జగన్ సాదర స్వాగతం పలికారు. ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా ఓ జ్ఞాపికను కూడా బహూకరించారు. అనంతరం ఇరువురు కాసేపు ముచ్చటించుకున్నారు. ఈ భేటీలో పలువురు ఉన్నతాధికారులు కూడా…
ఇటీవల అండర్-19 క్రికెట్ ప్రపంచకప్‌లో టీమిండియా తరఫున సత్తా చాటిన తెలుగు కుర్రాడు షేక్ రషీద్ బుధవారం నాడు ఏపీ సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈ సందర్భంగా షేక్ రషీద్‌ను సీఎం జగన్ అభినందించారు. షేక్ రషీద్ మరింత మెరుగ్గా ఆడేందుకు అతడికి ప్రోత్సాహకాలను ప్రకటించారు. షేక్ రషీద్‌కు గుంటూరులో ఇంటి స్థలం, రూ.10 లక్షల నగదుతో పాటు గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగం ఇవ్వాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. కాగా…
బీజేపీపై మరోసారి మంత్రి హరీష్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పేదలను పక్కనపెట్టి కార్పొరేట్ల కోసం పనిచేసే పార్టీ బీజేపీ అని హరీష్‌రావు విమర్శలు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు జాతీయ ప్రాజెక్టులు ఇచ్చి తెలంగాణకు మాత్రం ఇవ్వడం లేదని ఆరోపించారు. బీజేపీ నేతలు తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నారని తెలిపారు. బీజేపీకి ఓటు వేయకపోతే ఓటర్లను బుల్డోజర్లతో తొక్కిస్తామని రాజాసింగ్ అంటుంటే.. కిషన్‌రెడ్డి ఎందుకు స్పందించరని సూటిగా ప్రశ్నించారు. Read Also: EC: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నోటీసులు..…
ఏపీలో జగన్ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల. ఉద్యోగులను వాడుకుని వదిలేయడంలో జగన్ టాప్. అవసరం తీరే వరకే అన్న.. అవసరం తీరాక దున్న అన్నట్లు జగన్ వైఖరి.ఉద్యోగులు, పోలీసుల పట్ల జగన్ వ్యవహారం దుర్మార్గం. ప్రతిపక్షాల అక్రమ అరెస్టులకు అడ్డగోలుగా వాడుకుని.. అవమానకర రీతిలో సవాంగ్ ను గెంటేశారని మండిపడ్డారు. డీజీపీ స్థాయి వ్యక్తికి పోస్టింగ్ ఇవ్వకుండా అవమానించారు. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంను అన్నా అంటూనే.. గెంటారు. పీవీ…
రాష్ట్రంలో మహిళలు, విద్యార్ధినులపై వేధింపులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్న తీరుపై సీఎం జగన్ కి లేఖ రాశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు.రాష్ట్రంలో గంజాయి, డ్రగ్, మద్యం అమ్మకాల వల్లే రాష్ట్రంలో మహిళలపై వేధింపులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ మాఫియా విచ్చలవిడిగా చెలరేగిపోతోంది. దేశంలో ఏమూలన గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఏపీలో ఉంటున్నాయి. దీని వల్ల రాష్ట్ర యువత భవిష్యత్ తో పాటు రాష్ట్ర ప్రతిష్ట మసకబారుతోందని లేఖలో…
ఏపీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై బదిలీ వేటు పడింది. కొత్త డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇంటిలిజెన్స్ డీజీగా ఉన్నారు రాజేంద్రనాథ్ రెడ్డి. డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి ని నియమించేందుకు రంగం సిద్ధం అయింది. పీఆర్సీపై అసహనంతో ఉద్యోగులు ఇటీవల నిర్వహించిన ఛలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైన సంగతి తెలిసిందే. లక్షలాది మంది ఉద్యోగులు విజయవాడకు చేరుకుని తమ బలాన్ని ప్రదర్శించారు. పోలీసుల వైఫల్యమే దీనికి…
మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య శత జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. తిరుపతిలో కేంద్ర మాజీ మంత్రి , కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ దామోదం సంజీవయ్య శత జయంతి సందర్భంగా నివాళులర్పించారు. తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య చేసిన సేవలను శ్లాఘించారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దామోదం సంజీవయ్య ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చారన్నారు చింతా మోహన్. వృధ్ధాప్య ఫించన్లు, అవినీతిపై ప్రత్యేక చట్టం, బలిజ ,కాపులకు రిజర్వేషన్లు ఇచ్చిన…