తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరగుతున్నాయి. ఈ వేడుకలకు సీఎం జగన్ సతీసమేతంగా హాజరయ్యారు. ముందుగా దివంగత నేత వైఎస్ఆర్ ఫోటోకు నివాళులర్పించి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ఉగాది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ ఆస్థాన సిద్ధాంతి కప్పగంతు సుబ్బరామ సోమయాజి పంచాంగ పఠనం చేశారు. చాలా మంచి పథకాలతో ప్రజలకు దగ్గరయ్యే అవకాశం ఈ ప్రభుత్వానికి దొరుకుతుందని ఆయన చెప్పారు. శుభకృత్ నామసంవత్సరంలో పేరుకు తగ్గట్లే ప్రభుత్వానికి…
ఉగాది వచ్చేస్తోంది.. తెలుగు వారి పండుగతో పాటు కొత్త జిల్లాల్లో డబుల్ ఉగాది జరగనుంది. దీనికి కారణం.. ఉగాది నుంచి పాలన సాగించేందుకు యంత్రాంగం చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టడం. ఇప్పటికే కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం సిద్ధమవగా.. తాజాగా అన్ని శాఖలు ఉద్యోగుల విభజనతో పాటు కార్యాలయాలు కూడా సిద్ధం చేసుకుంటున్నాయి. అనంతలో కొత్త శ్రీ సత్యసాయి జిల్లా పేరుతో ఆవిర్భవిస్తున్న పుట్టపర్తిలో అధికారుల చర్యలతో సందడి కనిపిస్తోంది. ప్రభుత్వం చెప్పినట్టుగానే ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలనకు…
ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం వుందని వస్తున్న వార్తలపై వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ రెండున్నరేళ్లకు ఉంటుందని సీఎం జగన్ ముందే చెప్పారని, త్వరలోనే కెబినెట్ రీ-షఫుల్ ఉండే అవకాశం వుందన్నారు. పార్టీ బలోపేతం, ప్రభుత్వ పాలన రెండూ మాకు కీలకమే అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. అవసరాన్ని బట్టి మంత్రులుగా ఉండే వాళ్ళను పార్టీకి వినియోగించుకుంటాం అన్నారు. చంద్రబాబు తన పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు ముందస్తు రాగం తీస్తున్నాడు. ముందస్తుకు…
ఏపీ సినిమా టికెట్ రేట్స్ వివాదం ఒక కొలిక్కి వచ్చింది. ఎట్టకేలకు సినిమా టికెట్ రేట్స్ పెంచుతూ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం జగన్ ని కలిసి చిత్ర పరిశ్రమలోని సమస్యలను వివరించి .. చిత్రపరిశ్రమ పెద్దగా మెగాస్టార్ చిరంజీవి ఈ సమస్యకు పరిష్కారం అందించారు. ఇక తాజగా చిరు, సీఎం జగన్ కి కృతజ్ఞతలు తెలిపారు. సరికొత్త జీవోను అమలు చేసినందుకు ట్విట్టర్ ద్వారా జగన్ కి ధన్యవాదాలు తెలిపారు. “తెలుగు…
తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల సౌకర్యార్దం నిర్మించిన పద్మావతి నిలయాన్ని కలెక్టర్ కార్యాలయం పేరుతో ప్రభుత్వానికి అప్పగించడం మంచి పద్దతి కాదని మండిపడ్డారు బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. గతంలో కూడా టీటీడీ ఆస్తులను తాత్కాలికంగా ప్రభుత్వానికి కేటాయిస్తే….ఇప్పటి వరకు వాటిని ఖాళీ చెయ్యలేదన్నారు. వక్స్ బోర్డ్,క్రిస్టియన్ చారిటీ భూముల నుంచి ప్రభుత్వం ఒక్క అడుగు అన్న ఇలా పొందగలదా అని ప్రశ్నించారు భాను ప్రకాష్ రెడ్డి. ఈ నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే త్వరలో…
నేడు సీఎం జగన్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌తో కలిసి తూర్పు ఏజెన్సీలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పోలవరం నిర్వాసితుల కోసం నిర్మించిన పునరావాస కాలనీల సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు క్రింద ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయండి.
బీజేపీ కార్యాలయంలో ఫొటోగ్రాఫర్ల రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ముఖ్య అతిధిగా హాజరయ్యారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. వివిధ జిల్లాల నుంచి సమావేశానికి హాజరయ్యారు ఫొటో గ్రాఫర్లు. ఫొటోగ్రాఫర్లకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేదు. ఆత్మనిర్భర్ భారత్ లో చేతి వృత్తుల వారిని ప్రోత్సహించాలని మోడీ చెప్పారు. ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూసేందుకు మోడీ పాలనే కారణం. రష్యా, ఉక్రెయిన్ యుద్దం పెద్ద ఎత్తున జరుగుతుంది. వారి మధ్యలో మధ్యవర్తిత్వం నిర్వహించే…
ఇప్పుడు టాలీవుడ్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” ఫీవర్ పట్టుకుంది. అయితే ఏపీలో మాత్రం ఇంకా థియేటర్లు, టికెట్ రేట్లపై వివాదం నడుస్తూనే ఉంది. అయితే “భీమ్లా నాయక్” విడుదలకు ముందే సవరించిన టిక్కెట్ ధర GOను ఏపీ ప్రభుత్వం విడుదల చేస్తుందని అంతా భావించారు. ఏపీ ప్రభుత్వం థియేటర్లపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అక్కడ టిక్కెట్ ధరలు తక్కువగా ఉండడంతో ఇప్పటికే కొన్ని థియేటర్లు మూతపడ్డాయి. నిన్న ‘భీమ్లా నాయక్’…
ప్రధాని నరేంద్రమోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖలు రాశారు. విజయవాడ, విశాఖ, తిరుపతి విమానాశ్రయాల అభివృద్ధి, అంతర్జాతీయ స్థాయిలో విస్తరణ అంశాల పై వేర్వేరుగా సీఎం జగన్ లేఖలు రాశారు. ఏపీ ఆర్ధిక అభివృద్ధిలో విశాఖ నగరం కీలకపాత్ర పోషిస్తోందని ఆయన లేఖలో పేర్కొన్నారు. పర్యాటక కేంద్రంగా, పారిశ్రామికంగా ఈ నగరం నుంచి విమానాల రాకపోకలకు పెద్ద ఎత్తున…
ఆంధ్రప్రదేశ్ మంత్రులు పేర్ని నాని, కొడాలి నానిలకు పవన్ కళ్యాణ్ అభిమానుల సెగ తగిలింది. తాజాగా ఈ ఇద్దరు మంత్రులు ఓ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉండగా, పవన్ ఫ్యాన్స్ అడ్డుకున్నట్టు సమాచారం. ఆ వివరాల్లోకి వెళ్తే… కృష్ణాజిల్లా, గుడివాడలో జి3 భాస్కర్ థియేటర్ ప్రారంభ కార్యక్రమంలో మంత్రి కొడాలి నాని, పేర్ని నాని పాల్గొన్నారు. ప్రారంభ చిత్రంగా థియేటర్లో “భీమ్లా నాయక్”ను ప్రదర్శిస్తున్నారు థియేటర్ యాజమాన్యం. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఇద్దరు మంత్రులను…