తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరగుతున్నాయి. ఈ వేడుకలకు సీఎం జగన్ సతీసమేతంగా హాజరయ్యారు. ముందుగా దివంగత నేత వైఎస్ఆర్ ఫోటోకు నివాళులర్పించి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ఉగాది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ ఆస్థాన సిద్ధాంతి కప్పగంతు సుబ్బరామ సోమయాజి పంచాంగ పఠనం చేశారు. చాలా మంచి పథకాలతో ప్రజలకు దగ్గరయ్యే అవకాశం ఈ ప్రభుత్వానికి దొరుకుతుందని ఆయన చెప్పారు.
శుభకృత్ నామసంవత్సరంలో పేరుకు తగ్గట్లే ప్రభుత్వానికి అన్ని మంచి శుభాలే జరుగుతామని సిద్ధాంతి కప్పగంతు సుబ్బరామ సోమయాజి తెలిపారు. చల్లని పాలనకు తగ్గట్లే ప్రజలు హాయిగా ఉంటారని పేర్కొన్నారు. ప్రపంచ పరిణామాల వల్ల ధరలు పెరిగినా ఈ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుని, ప్రజలపై భారం పడకుండా చూస్తుందని సోమయాజి తెలిపారు. అంతేకాకుండా ఏపీలో మరోసారి వైసీపీ ప్రభుత్వమే వస్తుందని సిద్ధాంతి కప్పగంతు సుబ్బరామ సోమయాజి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, వైసీపీ కీలక నేతలు పాల్గొన్నారు.
Andhra Pradesh: అమరావతిపై ఏపీ హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్