ఆంధ్రప్రదేశ్ మంత్రులు పేర్ని నాని, కొడాలి నానిలకు పవన్ కళ్యాణ్ అభిమానుల సెగ తగిలింది. తాజాగా ఈ ఇద్దరు మంత్రులు ఓ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉండగా, పవన్ ఫ్యాన్స్ అడ్డుకున్నట్టు సమాచారం. ఆ వివరాల్లోకి వెళ్తే… కృష్ణాజిల్లా, గుడివాడలో జి3 భాస్కర్ థియేటర్ ప్రారంభ కార్యక్రమంలో మంత్రి కొడాలి నాని, పేర్ని నాని పాల్గొన్నారు. ప్రారంభ చిత్రంగా థియేటర్లో “భీమ్లా నాయక్”ను ప్రదర్శిస్తున్నారు థియేటర్ యాజమాన్యం. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఇద్దరు మంత్రులను థియేటర్ వద్ద పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ నాయకులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు.
Read Also : NV Prasad : పవన్ కళ్యాణ్ పై కాదు… థియేటర్ల వ్యవస్థ పై దాడి
అంతేకాదు జై పవన్ కళ్యాణ్, ప్రభుత్వ మొండి వైఖరి నశించాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు అభిమానులు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ , పలువురు అభిమానులను అరెస్ట్ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ సినిమాలను వేధించడం దుర్మార్గమని మండిపడుతున్న పవన్ అభిమానులు. ఫోటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానికి వినతిపత్రం ఇచ్చేందుకు మాత్రమే తాము వచ్చామని, ఇలా అరెస్టు చేయడం అన్యాయం అని జనసేన పార్టీ శ్రేణులు అంటున్నారు.