ఏపీలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం మళ్ళీ మొదలైంది. టీడీపీ సీనియర్ నేత వెంకన్న 100 మందితో సూసైడ్ బ్యాచ్ రెడీగా వుందన్న వ్యాఖ్యలపై మంత్రి జోగిరమేష్ స్పందించారు. బుద్దా వెంకన్న వ్యాఖ్యలపై మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెన్నుపోటు పొడవటం చంద్రబాబు రక్తంలోనే వుంది. టీడీపీ మాపై పోటీ పడి గెలిచే అవకాశమే లేదు. మేం వాళ్ళని టచ్ చెయ్యనవపరం లేదు. జనమే ఓట్లతో సమాధానం చెప్పారు. చంద్రబాబే సూసైడ్…
ఈనెల 21న ఏపీ సీఎం జగన్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన షెడ్యూల్‌ను సీఎంవో కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. తాడేపల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరనున్న సీఎం జగన్ ఉదయం 10:50 గంటలకు బలభద్రపురంలోని గ్రాసిం పరిశ్రమ ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. ఉదయం 11:05 గంటలకు పరిశ్రమ ప్లాంట్‌కు చేరుకుని 15 నిమిషాలపాటు పరిశ్రమను పరిశీలించనున్నారు. ఉదయం 11:25 గంటలకు పరిశ్రమను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12:25 గంటలకు తిరిగి హెలిప్యాడ్‌కు చేరుకుని…
అప్పుల ఊబిలో ఉన్న రైతులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రతి రైతు కుటుంబానికి రూ.50 వేలు పెట్టుబడి ఇస్తామన్న హామీ ఏమైంది? రైతు ఉసురు తీసుకొనే పరిస్థితి రాకుండా వ్యవస్థలు పని చేయాలి. రాష్ట్రంలో నిత్యం ఏదొక ప్రాంతంలో అన్నదాతలు బలవన్మరణానికి పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకోవడం అత్యంత విషాదకరం అన్నారు పవన్. ఇటీవలే పల్నాడు, కర్నూలు నంద్యాల జిల్లాల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. బాధిత రైతుల కుటుంబాలకు ప్రగాఢ…
భూముల రీ-సర్వేపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందన్నారు సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ సాయి ప్రసాద్. భూముల రీ-సర్వే అనేది సీఎం జగన్ మానస పుత్రిక. ప్రతి 30 ఏళ్లకోసారి రీ-సర్వే చేయాలని నిబంధనలు.కానీ పొలం గట్ల తగాదాలు వస్తాయి.. పెద్ద గొడవలు అవుతాయనే ఆందోళనతో ఎవ్వరూ రీ-సర్వే చేయించేందుకు సాహసించ లేదు. దీంతో ఎప్పుడో బ్రిటీష్ కాలం నాటి సర్వే వివరాలే ఉన్నాయన్నారు. కానీ సీఎం జగన్ సాహసంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రీ-సర్వేలో భాగంగా ఏమైనా…
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడుపై మండిపడ్డారు మంత్రి మేరుగ నాగార్జున. టీడీపీ అభిప్రాయాలని ఇతర మార్గాల ద్వారా చెప్పించారు. సంక్షేమ పథకాలు ఆగిపోవాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు ఈ కుట్రలని గమనించాలని కోరుతున్నా. అంబేద్కర్, పూలే , పెరియార్ రామస్వామి ఆలోచనలు ఈ రోజు అమలవుతున్నాయి. చంద్రబాబుకి ఎవరైనా ఓటేస్తే ఈ పథకాలు ఆపేస్తామని చెప్పకనే చెప్పారు. జగనన్న అమ్మ ఒడి ద్వారా 44 లక్షలపైన తల్లులకి అమలు చేస్తున్నాం అన్నారు మంత్రి…
ఏపీలో విద్యుత్ కష్టాలు జనానికి ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. పరిశ్రమలకు కూడా ఇక్కట్లు పాలవుతున్నాయి. ఈనేపథ్యంలో విద్యుత్ శాఖపై మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష నిర్వహించారు. విద్యుత్ పరిస్థితి.. అదనపు విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలపై చర్చించారు. అదనంగా మరో 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాలిచ్చారు. కృష్ణపట్నం, ఎన్టీటిపిఎస్సులల్లో 800 మెగావాట్ల విద్యుత్ యూనిట్లను వినియోగించుకోవాలని సూచన.హైడెల్ ప్లాంట్ల ద్వారా మరో 6000 మెగావాట్ల ఉత్పత్తికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు అధికారుల వెల్లడి.మే ఒకటి…
ఏపీలో అన్ని పథకాలు సక్రమంగా అమలవుతున్నా విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు. ఒకటో తేదీన సూర్యోదయానికి ముందే పెన్షన్ల పంపిణీ జరుగుతుంటే దురుద్దేశపూర్వకంగా దుష్ప్రచారం ప్రారంభించారని ఆయన మండిపడ్డారు. పంచాయితీ నిధులను అవసరం మేరకు ప్రభుత్వం వినియోగించుకోవడం కొత్తేమీ కాదన్నారు. టీడీపీ హయాంలో జరగలేదని చంద్రబాబు, యనమల రామకృష్ణుడు చెప్పగలరా…? గ్రామీణ ప్రాంతాల్లో సచివాలయాలు, హెల్త్ సెంటర్స్ అభివృద్ధి, పూర్తి స్థాయి సిబ్బంది నియామకం ప్రాధాన్యతగా పెంచుకున్నాం. నీరు చెట్టు…
కోవిడ్ అనంతరం కలియుగ వైకుంఠం తిరుమల భక్తులతో కిక్కిరిసిపోతోంది. ఈ నెల 11వ తేది నుంచి 17వ తేది వరకు భారీసంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. 7 రోజులలో 5.30 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. 24.38 లక్షల లడ్డూలు విక్రయిస్తే….హుండీ ద్వారా రూ.32.5 కోట్లు ఆదాయం లభించిందన్నారు. 46 వేల 419 వాహనాలలో భక్తులు తిరుమలకు తరలివచ్చారన్నారు. మే 1వ తేది నుంచి శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులను…
మెగా స్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “ఆచార్య”. కొరటాల శివ దర్శకత్వంలో భారీ అంచనాలతో రూపొందిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజాహెగ్డే కథానాయికలుగా నటిస్తున్నారు. మ్యూజికల్ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీకి సంగీతం సమకూరుస్తున్నారు. “ఆచార్య” మూవీని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మెగా పవర్ ప్యాక్డ్ మూవీని…
బీజేపీ నేతలు పదునైన విమర్శలతో వైసీపీని ఇరుకునపెడుతున్నారు. జగన్ కేబినెట్ గురించి బీజేపీ నేతలు ఘాటుస్థాయిలో మండిపడుతున్నారు. తాజాగా ఉత్తరాంధ్ర నీటి ప్రాజెక్టులపై ఏపీ సీఎం జగన్‌కి బీజేపీ చీఫ్ సోము వీర్రాజు బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీల పాత వీడియోని ట్యాగ్ చేస్తూ సీఎంకు లేఖ రాశారు. ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం ఒక రూట్ మ్యాప్ ప్రకటించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర విషయంలో ఉత్తరాంధ్ర…