Gudivada Amarnath: ఏపీ రాజధానిపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. వికేంద్రీకరణ విధానానికి బలం చేకూర్చే విధంగా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశామని తెలిపారు. రాష్ట్రానికి ఉన్న రాజ్యాంగపరమైన హక్కులను గుర్తు చేయడం కోసమే సుప్రీంకోర్టుకు వెళ్లామన్నారు. మూడు రాజధానులకు న్యాయపరమైన అనుతులు పొందే దిశగా సుప్రీంకోర్టును ఆశ్రయించడం తొలి అడుగు అన్నారు.…
మూడు రాజధానుల వ్యవహారంపై భారత అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… ఇప్పటికే మూడు రాజధానుల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంలో సవాల్ చేసింది ఏపీ సర్కార్… మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేసిన తర్వాత.. ఈ అంశంపై హైకోర్టుకు జోక్యం చేసుకునే అధికారం లేదని ప్రభుత్వం పేర్కొంది… అయితే, రాజధాని అంశం చట్టం చేసే అధికారం శాసనసభకు లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది.. కాగా, చట్టాలు చేయటానికి శాసనసభకు ఉన్న అధికారాలను…
Gudivada Amarnath: ఏపీ రాజధానిపై మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే అకడమిక్ సంవత్సరం నుంచే విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. త్వరలో అసెంబ్లీలో ఈ అంశంపై బిల్లు కూడా పెడతామని మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. తమకు సవాళ్లు విసరడం దేనికి అని.. టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సిట్టింగ్‌లకే టికెట్లు ఇస్తానని చంద్రబాబు చెప్పగానే…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి.. ఈ సారి మూడు రాజధానుల బిల్లు శాసనసభ ముందుకు వచ్చే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.. మరోవైపు.. అమరావతి రైతుల మహా పాదయాత్ర రెండో విడత ప్రారంభమైంది.. ఈ నేపథ్యంలో.. అమరావతి ప్రాంతంలో నిర్మాణాలు, ల్యాండ్ ఫూలింగ్ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కార్మూరి నాగేశ్వరరావు.. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ల్యాండ్ పూలింగ్ విషయంలో ఐఏఎస్ చెరుకూరి శ్రీధర్ సహా ఎవ్వరు తప్పు చేసినా…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు సమయం ఆసన్నమైంది… ఈ సారి మూడు రాజధానుల బిల్లు తీసుకొచ్చేందుకు అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది.. అయితే, రాజధాని విషయంలో బీజేపీ స్టాండ్‌పై మరోసారి క్లారిటీ ఇచ్చారు ఆ పార్టీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్.. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానులు బిల్లు తెస్తారన్నారు.. అయితే, అమరావతినే ఏకైక రాజధానిగా ఉండాలి అని బీజేపీ స్పష్టంగా చెబుతోందని మరోసారి గుర్తుకు చేశారు.. మూడు…
Srikanth Reddy: మూడు రాజధానుల అంశంలో టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరిని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తప్పుబట్టారు. అమరావతి రైతుల పాదయాత్రను తాను తప్పుపట్టడం లేదని.. పాదయాత్రలో మాట్లాడిన వాళ్ల మాటలు రాయలసీమ వాసిగా తనకు బాధ కలిగించాయని తెలిపారు. మూడు రాజధానులు చేస్తే రాయలసీమకు చుక్క నీరు ఇవ్వమని అంటున్నారని.. మూడు రాజధానులు అమలు చేస్తే మధ్య ఆంధ్ర ప్రదేశ్ కోసం ఉద్యమం చేస్తామంటున్నారని.. ఈ వ్యాఖ్యల వెనుక చంద్రబాబు ఉన్నారని శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు.…
Somu Veerraju: ఏపీ రాజధాని అమరావతిలో బీజేపీ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘మనం – మన అమరావతి’ పేరుతో బీజేపీ పాదయాత్రను చేపట్టింది. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాజధాని నిర్మాణం కోసం తీసుకున్న భూముల్లో ఏమేం చేస్తారనే దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కంటే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చాలా బాగుందని విజయసాయిరెడ్డి చెప్తున్నారని.. నిజంగానే ఏపీ…