ఏపీ అసెంబ్లీలో టీడీపీ-వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం ఎప్పుడూ సాగుతూ వుంటుంది. అనంతపురం జిల్లాకు చెందిన పయ్యావుల కేశవ్ ఆకట్టుకునేలా ప్రసంగిస్తుంటారు. వైసీపీ సభ్యులపై ఆయన తనదైన రీతిలో కౌంటర్లు వేస్తుంటారు. తాజాగా ఏపీ అసెంబ్లీలో పయ్యావుల, మంత్రి బుగ్గన మధ్య వాడివేడి చర్చ సాగింది. అమరావతి భూముల వివాదంపై అసెంబ్లీలో చర్చలో పయ్యావుల ఆవేశంగా మాట్లాడారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ కేసులు పెట్టారు.. కోర్టు ద్వారా చీవాట్లు తిన్నా మీరు మారలేదు.
ఎస్సీ భూముల కొనుగోలు విషయంలో గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు పట్టించుకోలేదు. సీఎం ప్రకటన తర్వాతే నేను భూములు కొన్నాను. భూములు కొంటే తప్పేంటి? అసెంబ్లీలో వికేంద్రీకరణ బిల్లుపై చర్చలో ఆర్థికమంత్రి బుగ్గనకు పయ్యావులకు మధ్య మాటల యుద్ధం.. 4-9-2014 న రాజధాని ప్రకటన చేశారని పయ్యావుల వివరించారు. నేను సెప్టెంబర్ నెలలో కొన్నాను. ఇన్ సైడర్ ట్రేడింగ్ పై కేసులు ఎందుకు విత్ డ్రా చేసుకున్నారని పయ్యావుల ప్రశ్నించారు.
ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు 16మందిని స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. టీడీపీ సభ్యుల సస్పెన్షనుకు ముందు సభలో టెన్షన్ ఏర్పడింది. పొడియం ముందున్న టీడీపీ సభ్యులను ఛైర్లల్లో కూర్చొపెట్టేందుకు ప్రయత్నించారు మార్షల్స్.సభలో సభ్యులపై చేయి వేసే అధికారం మార్షల్సుకు లేదంటూ టీడీపీ ఎమ్మెల్యేల ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్షల్సుపై విరుచుపడ్డ టీడీపీ ఎమ్మెల్యేలు.. పలువురు మార్షల్సును తోసేశారు టీడీపీ సభ్యులు.ఛైర్లల్లో కూర్చునేందుకు టీడీపీ సభ్యులు నిరాకరించడంతో సస్పెన్షన్ చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం.
అనంతరం టీడీపీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. బుగ్గన మళ్లీ బుర్ర కథలు చెప్పారు.మూడేళ్ల క్రితం చెప్పినవే మళ్లీ మళ్లీ చెప్పారు.రాజధాని భూముల్లో ఏవో అక్రమాలు జరిగాయని మళ్లీ అందరి పేర్లు బుగ్గన ప్రస్తావించే ప్రయత్నం చేశారు.ఇవాళ అసెంబ్లీలో వైసీపీ బొక్కా బోర్లా పడింది.బుగ్గనను చూసి డోన్ నడివీధుల్లో నవ్వుతున్నారు.బుగ్గన తన వయస్సుకు తగ్గట్టు వ్యవహరిస్తే బాగుంటుంది.రాజధాని పరిధిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పే ప్రయత్నం చేశారు.
ఇన్ సైడర్ ట్రేడింగ్ కాదు.. ఇన్ సైడ్ ఫీలింగ్ బయటపడింది.ఎస్సీ భూముల్లో అక్రమాలను తప్పుడు ఆరోపణలతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.ఇప్పటికీ భూముల అక్రమాలపై విచారణ చేయాలనుకుంటే.. అమరావతి భూములతో పాటు.. విశాఖ భూముల పైనా విచారణ చేసే దమ్ముందా..?విశాఖ భూములపై హైకోర్టులో విచారణకు సిద్దమా..? అన్నారు పయ్యావుల.
Read Also: Ranveer Singh: నువ్వో పెద్ద ఫిగర్ వా.. నీ ఫోటో మార్ఫింగ్ చేయడానికి