Amaravathi: అమరావతి రాజధాని అంశంపై దాఖలైన పిటిషన్‌లపై మంగళవారం నాడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదన్న హైకోర్టు తీర్పును సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వం.. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని పిటిషన్‌లో కోరింది. ఈ పిటిషన్‌లో కీలక అంశాలను ప్రస్తావించిన ఏపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై ఉపశమనం ఇవ్వాలని అభిప్రాయపడింది. అయితే అమరావతి రాజధాని అంశంపై రైతులు, ఏపీ ప్రభుత్వం వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన…
Dharmana Prasad Rao: వికేంద్రీకరణ అంశంపై మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక కామెంట్లు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. అమరావతిలో సామాన్యులకు స్థానం ఉండదని ఆరోపించారు. క్యాపిటల్ అంటే యాక్సప్టబులిటీ ఉండాలని.. రవాణా సౌకర్యం ఉండి తీరాలని స్పష్టం చేశారు. విశాఖపట్నంలో ధనవంతుల జాబితా తీస్తే 100 మందిలో 99 మంది ఇతర ప్రాంతాల వారే ఉంటారన్నారు. ఉత్తరాంధ్రకు రాజ్యాంగబద్ధంగా ఆస్తులు, సంపదలు చేజారాయన్నారు. దేశంలో ఎక్కడ అభివృద్ధి జరిగినా క్యాపిటల్ చుట్టూ మాత్రమే జరిగిందని…
Dharmana Prasad Rao: ఏపీలో వికేంద్రీకరణ అంశంపై రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రను అధికార పార్టీ నేతలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడు రాజధానుల అంశంపై అధికార పార్టీలో కీలక సంకేతాలు చోటు చేసుకున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖ సాధన ఉద్యమం కోసం రాజీనామా చేస్తానని సీఎం…
Rahul Gandhi: ఏపీలో కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర రెండో రోజు కొనసాగుతోంది. కర్నూలు జిల్లా ఆదోనీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీకి ఒక్కటే రాజధాని ఉండాలని.. అది అమరావతి మాత్రమే ఉండాలని తన అభిప్రాయంగా రాహుల్ గాంధీ తెలియజేశారు. మూడు రాజధానుల నిర్ణయం సరైంది కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కొన్ని హామీలు ఇచ్చామని, వాటిని నెరవేర్చే బాధ్యత కాంగ్రెస్‌పై…
Kishan Reddy: అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యంగా మూడు రాజధానులను ఏర్పాటు చేసేందుకు దూకుడు ముందుకెళ్తున్న వైసీపీ ప్రభుత్వానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి షాకిచ్చారు. ఏపీకి అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అమరావతే రాజధాని అని ప్రధాని మోదీ చెప్పారని తెలిపారు. అమరావతికి బీజేపీ కట్టుబడి ఉందని అన్నారు. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఏది చేసినా రాజధాని మారే ప్రసక్తే లేదని కిషన్‌రెడ్డి తేల్చి చెప్పారు. రాజకీయాల్లో కక్షసాధింపు…
Adimulapu Suresh: రాజధాని వికేంద్రీకరణపై మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని కోసం అంటూ పాదయాత్ర చేస్తున్న వాళ్లు రైతుల్లా కనిపించటం లేదని ఆరోపించారు. ఓ అజెండా ప్రకారం చంద్రబాబు చెప్పినట్లుగా వారు చేస్తున్నారన్నారు. టీడీపీ నేతలు ఓ దురుద్దేశంతో చేయిస్తున్న పాదయాత్రలా కనిపిస్తోందని.. కొంతమంది పెట్టుబడిదారులు వెనుక ఉండి నడిపిస్తున్నారని విమర్శలు చేశారు. వికేంద్రీకరణ అనేది ప్రజల ఆకాంక్ష అని.. రాష్ట్ర వ్యాప్తంగా వికేంద్రీకరణ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్…
Dharmana Prasad Rao: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఆంధ్రప్రదేశ్ పరిపాలన వికేంద్రీకరణపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి మంత్రులు ధర్మాన ప్రసాదరావు, చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యేలు, మేధావులు, సామాజిక వేత్తలు హాజరయ్యారు. రాజమండ్రి వైసీపీ ఎంపీ మార్గాని భరత్ అధ్యక్షతన ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. హైదరాబాద్ లాంటి రాజధాని నుంచి విడిపోయిన మనం దురదృష్టవంతులు అయ్యామని…