CM Chandrababu: రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీఏ) సమీక్ష సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ప్రతి 15 రోజులకు రాజధాని పై సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు.. కొన్ని సంస్థలు.. వర్క్ ఫోర్స్.. మెషినరీ.. పూర్తి స్థాయిలో కేటాయించలేదన్నారు.. ఇలా ఉన్న సంస్థలు తమ పనితీరు మెరుగు పరుచుకోవలని సూచించారు.. ఇక, రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో రైతులను ఇబ్బంది పెట్టవద్దని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు.. త్వరలో రాజధాని రైతులతో…
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా CRDA నూతన భవనం ప్రారంభం కానుంది. ఉదయం 9.54 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవం అనంతరం సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ ఢీల్లీకి వెళ్లనున్నారు.
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ - ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి అదనంగా మరో రూ.14,200 కోట్ల రుణం తీసుకోనున్నారు.. ఈ అదనపు రుణం పొందేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.. అమరావతిలో వివిధ ప్రాజెక్టులకు రూ.14,200 కోట్ల రుణం అందించనున్నాయి ఈ రెండు అంతర్జాతీయ బ్యాంక్‌లు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైసీపీ లీడర్స్ చేసిన తాజా కామెంట్స్ ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్ అయ్యాయి. తాము తిరిగి అధికారంలోకి వస్తే... జగన్ అమరావతి నుంచే పరిపాలన సాగిస్తారంటూ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.. సజ్జల లాంటి నాయకుడు మాట్లాడారంటే..
అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానుల పాట గట్టిగా పాడింది వైసీపీ. కానీ... శృతి కుదరక మొదటికే మోసం వచ్చింది. గత ఎన్నికల్లో కొట్టిన దెబ్బకు తత్వం బోధపడి ఇప్పుడు మళ్ళీ స్టాండ్ మార్చుకున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అటు తాము బాగా ప్రేమించిన విశాఖ వాసులు రాజధానిని ఓన్ చేసుకోలేకపోయారు, ఇటు కర్నూలు జిల్లా వాసులు అంతగా రియాక్ట్ అవలేదు.
అమరావతిపై వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని పెడితే ఖర్చు తక్కువ అవుతుందన్నారు.. అయితే, ఇంతకు ముందు అమరావతిని రాజధానిగా తీసేస్తామని మేం అనలేదన్నారు.. అమరావతిని కలుపుకొని ఢీసెంట్రలైజ్ అన్నాం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం అన్నాం.. మూడు రాజధానులు అని తప్పుడు ప్రచారం చేశారన్నారు..
అమరావతి చాలా సేఫ్ సిటీ... ఇందులో అనుమానం లేదన్నారు మంత్రి పొంగూరు నారాయణ.. ఇవాళ ఉదయం రాజధాని ప్రాంతంలో పర్యటించిన ఆయన.. అమరావతి - నేలపాడులోని గెజిటెడ్ అధికారుల భవనాలు పరిశీలించారు.. క్లాస్- 4 ఉద్యోగుల క్వార్టర్లు నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.. ఇక, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి నారాయణ.. అమరావతి నిర్మాణంలో ప్రస్తుతం 13 వేల మంది పని చేస్తున్నారని తెలిపారు.. అధికారుల కోసం ఆరు టవర్ల నిర్మాణం జరుగుతోంది..…
సెప్టెంబర్ నుంచి అమరావతి పనులు క్లియర్ గా కనిపిస్తాయన్నారు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్.. 40 నుంచి 50 వేల కోట్ల రూపాయల పనులు త్వరలో జరగబోతున్నాయన్నారు.. గత 5 ఏళ్లలో వ్యవస్థలన్నీ సర్వనాశనం చేశారన్న ఆయన.. రెండు మూడు సంవత్సరాల్లో మంచి నగరాన్ని చూస్తారని తెలిపారు.. చిన్న సమస్యలను ఉంటే వాటిని మేం పరిష్కరిస్తాం.. ఏ రాష్టానికి లేని సంస్థలు, ఉద్యోగాలు ఏపీకి మూడు, నాలుగు సంవత్సరాల్లో రాబోతున్నాయి..
AP Capital Project: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి కోసం నిధులు సమీకరించుకునే పనిలో సీఆర్డీఏ పడింది. ఏడీబీతో కుదుర్చుకున్న రుణ ఒప్పందం మేరకు వచ్చే నాలుగేళ్లలో అమరావతి రాజధాని నగరంలో భూ విక్రయానికి ప్రణాళిక రచిస్తుంది.