హైదరాబాద్ నుంచి ఏపీ రాజధాని అమరావతి ప్రాంతానికి వచ్చి పని చేస్తున్న ఉద్యోగుల ఉచిత వసతి సదుపాయాన్ని మరో రెండు నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఏప్రిల్ 30వ తేదీ అంటే ఇవాళ్టితో గతంలో పొడిగించిన సమయంలో ముగియడంతో.. మే 1 తేదీ నుంచి జూన్ 30 తేదీ వరకూ ఉచిత వసతి సదుపాయాన్ని పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ సచివాలయం మహిళా ఉద్యోగుల సంఘం, ఏపీ ఎన్జీఓలు, ఏపీ…
ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని గత నెల 3వ తేదీన హైకోర్టు తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ తీర్పుకు సంబంధించి తాజాగా ఏపీ ప్రభుత్వం తాజాగా హైకోర్టులో ఓ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ మేరకు సీఎస్ సమీర్ శర్మ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. 190 పేజీలతో కూడిన ఈ అఫిడవిట్‌లో ప్రభుత్వం పలు అంశాలను ప్రస్తావించింది. ఈనెల 3లోగా సీఆర్‌డీఏ రైతులకు ఇచ్చిన ప్లాట్లలో పనులు పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని హైకోర్టు…
సీఎం వైఎస్ జగన్ ఎంత త్వరగా విశాఖ వెళ్లి కూర్చొంటే మాకు మరిన్ని సీట్లు పెరుగుతాయన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్.. ఇప్పటికే విశాఖలో అరాచకం.. భూకబ్జాలు పెరిగాయి.. సీఎం వెళ్తే మరింతగా పెరుగుతాయని.. విజయసాయి దెబ్బకు ఇప్పుడు విశాఖలో అందరూ భయపడుతున్నారు.. రేపు సీఎం వెళ్తే ఆయనకు భయపడతారని మీడియా చిట్‌చాట్‌లో పేర్కొన్నారు.. 1200 గజాల భూమి ఉన్న ప్రతి విశాఖ వాసి గజగజలాడుతున్నాడన్న లోకేష్… పరిపాలనా కేంద్రీకరణ.. అభివృద్ధి వికేంద్రీకరణతోనే…
ఏపీకి మూడు రాజధానుల విషయంలో చంద్రబాబు వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. రాజ్యాంగానికి లోబడి చట్టాలు ఉండాలని.. ఏ వ్యవస్థ అయినా వారి పరిధిలోనే పనిచేయాలని బొత్స వ్యాఖ్యానించారు. రాజధాని విషయంలో హైకోర్టు తీర్పుపై చంద్రబాబు సభలో మాట్లాడాల్సిందని బొత్స కామెంట్ చేశారు. దమ్ముంటే టీడీపీ శాసనసభ్యులు రాజీనామా చేసి ప్రజాభిప్రాయం కోరమని చెప్పాలని చంద్రబాబుకు హితవు పలికారు. టీడీపీ వాళ్లకు ఉత్సాహంగా ఉంటే రాజీనామాలు చేయమని చెప్పాలన్నారు. రాజధాని పరిధిలో మిగిలిన 7,300…
రాష్ట్రంలోని ప్రజలందరికీ మంచి చేయడానికే తమ ప్రభుత్వం ఉందని ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ స్పష్టం చేశారు. ఆచరణ సాధ్యం కాని తీర్పులు ఉండకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని.. ఏపీ హైకోర్టు చెప్పినట్లు నెలరోజుల్లో రాజధాని నిర్మాణం సాధ్యం కాదని జగన్ వ్యాఖ్యానించారు. వికేంద్రీకరణపై న్యాయసలహా తీసుకుని ముందుకు వెళ్లేలా ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చిస్తున్నామని తెలిపారు. వికేంద్రీకరణ విషయంలో వెనుకడుగు వేయమని, ఆటంకాలు ఎదురైనా ముందుకెళ్తామని జగన్ తేల్చి చెప్పారు. చంద్రబాబుకు అమరావతిపై ప్రేమ లేదని.. ఒకవేళ…
ఏపీ అసెంబ్లీలో పరిపాలన వికేంద్రీకరణపై జరిగిన చర్చ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగించారు. రాజధాని అమరావతిపై తనకు ప్రేమ ఉందని.. ప్రేమ ఉంది కాబట్టే అమరావతిలో తాను ఇల్లు కట్టుకున్నానని.. న్యాయరాజధానిగా అమరావతి కొనసాగాలని తాను నిర్ణయం తీసుకున్నట్లు సీఎం జగన్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగం ప్రకారం శాసన, కార్యనిర్వహక, న్యాయ వ్యవస్థలు దేనికవే ప్రత్యేకమైనవని జగన్ అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం ప్రకారం చట్టం చేసే అధికారం శాసనవ్యవస్థకు ఉంటుందన్నారు. నెల రోజుల్లో రూ.లక్ష కోట్లతో రాజధాని కట్టేయాలని కోర్టులెలా…
ఏపీ అసెంబ్లీలో పాలన వికేంద్రీకరణ అంశంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు చర్చ ప్రారంభించారు. చట్టాలు చేసే అధికారం కేవలం శాసన వ్యవస్థకే ఉన్న విషయాన్ని రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పారని ఆయన వెల్లడించారు. మూడు రాజధానుల అంశంపై ఏపీ హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత తాను సీఎం జగన్‌కు లేఖ రాసిన విషయాన్ని ధర్మాన ప్రసాదరావు గుర్తు చేశారు. హైకోర్టు తీర్పు తర్వాత న్యాయ నిపుణులతో చర్చించానని చెప్పారు. దీనిపై…
జనసేన ఆవిర్భావ దినోత్సవ వేదిగా అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అమ్నఒడి పథకానికి డబ్బులు ఎందుకు ఆగాయి..? ఆరోగ్య శ్రీ డబ్బులు ఎందుకు చెల్లించడం లేదు..? అన్నింటికీ కారణం అభివృద్ధి లేకపోవడమే కారణం అన్నారు.. అమర్ రాజా సంస్థ, కియా అనుబంధ పరిశ్రమలు వైసీపీ చేసే గొడవకు వెళ్లిపోయాయని విమర్శించిన ఆయన.. గ్రామ పంచాయతీల్లో డబ్బుల్లేవ్.. టీడీపీ ఐదేళ్ల హయాంలో రూ. 53 వేల కోట్ల మేర మద్యం…
వెల్లంపల్లి వెల్లుల్లిపాయకు బంతి చామంతి నేతలంటూ వైసీపీ నేతలపై సెటైర్లు వేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. సంపూర్థ మద్యపాన నిషేదం ద్వారా మద్యం ఆదాయం పెంచుకుంటాం.. ప్రభుత్వం తప్పులను ప్రశ్నిస్తే.. వైసీపీ ఎంపీనైనా చితక్కొట్టిస్తాం.. ఒక్క ఛాన్స్ ఇస్తే ఏపీని 25 ఏళ్లు వెనక్కు తీసుకెళ్తాం.. మరోసారి ఛాన్స్ ఇస్తే స్కూల్ పిల్లల చేతుల్లో చాక్లెట్లు లాక్కొంటామన్న రీతిలో వైసీపీ వ్యవహరిస్తోందన్న ఆయన.. ప్రతిపక్షంలోకి ఉండి అమరావతిని ఒప్పుకుని.. అధికారంలోకి రాగానే రాజధానిని రద్దు చేసిందన్నారు..…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే.. రాజధాని ఇక్కడి నుంచి కదలదు అని స్పష్టం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. గుంటూరు జిల్లా ఇప్పటం వేదికగా జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ.. రాజులు మారినప్పుడల్లా రాజధానులు మారవు.. సీఎంలు మారినప్పుడల్లా పాలసీలు మారవు అని స్పష్టం చేశారు… పాలసీల్లో తప్పొప్పులు ఉంటే.. సరిచేసుకుంటూ ముందుకెళ్లాలి కానీ, పాలసీలు మార్చేందుకు మీరెవరు? అని ప్రశ్నించారు. ఇప్పుడు 3 రాజధానులు అంటున్న నేతలు… ఆరోజు గాడిదలు కాస్తున్నారా?…