దేశ రాజధాని ఢిల్లీలో ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఏపీకి చెందిన నేతలు వరుసగా ఢిల్లీలో మంతనాలు జరపడం ఆసక్తి రేపుతోంది. మొన్న పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కలిసారు.
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. సాయంత్రానికి సోము వీర్రాజు ఢిల్లీకి చేరుకోనున్నారు. సంయుక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చేరిక సందర్భంగా నిన్ననే ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది.