ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. సాయంత్రానికి సోము వీర్రాజు ఢిల్లీకి చేరుకోనున్నారు. సంయుక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చేరిక సందర్భంగా నిన్ననే ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. అయితే, సోము వీర్రాజు నిర్ణయించిన కార్యక్రమాల దృష్ట్యా, నిన్న ఢిల్లీకి వెళ్ళలేకపోయారు. ఈరోజు హస్తినకు వెళ్లారు. మూడు రోజులు పాటు ఢిల్లీలోనే వీర్రాజు ఉండి, పార్టీ అధిష్టానం పెద్దలతో భేటీకానున్నారు. రాష్ట్రంలోని పలు అంశాలపై అందుబాటులో ఉన్న పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు.
Also Read:Israel: ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య తీవ్ర ఉద్రిక్తత.. టెల్ అవీవ్, వెస్ట్ బ్యాంక్ టార్గెట్ గా దాడులు..
మరోవైపు నిన్న ఢిల్లీ పెద్దల సమక్షంలో బీజేపీలో చేరిన మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. వరుసగా పార్టీ పెద్దలతో భేటీలు అవుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిసిన ఆయన.. తాజా రాజకీయాలు, రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై చర్చించినట్లు తెలుస్తోంది. బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్‌ను కూడా కలిశారు. కాగా, ఇటీవలే ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వచ్చారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్‌లతో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్ర సమస్యలను పరిష్కరించాలని కోరారు. తాజాగా రాష్ట్ర బీజేపీ నేతలు ఢిల్లీ పర్యటన ఆసక్తి రేపుతోంది.
Also Read:Andhra Pradesh: ఏపీలో అరుదైన మూలకాలు.. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కనుగొన్న శాస్త్రవేత్తలు..