.జనసేనతో పొత్తుపై నోరు మెదపని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. వైసీపీ, టీడీపీలతో పొత్తు ఉండదు, వచ్చే ఎన్నికల్లో ప్రజలతోనే బీజేపీ పొత్తు ఉంటుందన్నారు సోము వీర్రాజు. టిడిపి వైసిపి కాకుండా భావసారుభ్యత కలిగిన పార్టీలతో మాత్రమే బీజేపీతో ముందుకెళ్లాలని ప్రజలు కోరుకుంటున్నారని సోము వీర్రాజు అన్నారు. దాని ప్రకారమే బీజేపీ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యులు GVL నరసింహారావు. రాష్ట్రంలో 2014లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రెండు పార్టీలు ప్రజలను మోసం చేశాయి..
వైసీపీ, టిడిపి కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు.. వొచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వొచ్చే విధంగా కృషి చేయాలని తీర్మానించారు..బీజేపీని నిర్వీర్యం చేయాలని, గట్ వైసీపీ,టిడిపి కుట్ర చేస్తున్నారు.బీజేపీ నాయకులను తమవైపు తిప్పుకునేందుకు టిడిపి, వైసీపీ ప్రయత్నిస్తుంది.. వారు చేస్తున్న కుట్రలను బీజేపీ చూస్తూ ఊరుకోదు అన్నారు. జనసేన తో పొత్తు కొనసాగుతుంది. కొత్తగా తీర్మానం చేయాల్సింది ఏంలేదన్నారు. బలవంతపు పొత్త్తులు ఎక్కడ వుండవన్నారు. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ లో కొనసాగుతున్నారు.. సమావేశానికి రాలేనని సమాచారం ఇచ్చారు.
భీమవరంలో జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశం పలు తీర్మానాలు చేసింది. వైసీపీ అధోగతి పరిపాలనపై పోరాటం చేయాలని నిర్ణయించింది. కేంద్ర పథకాలకు ముఖ్యమంత్రులు వారి కుటుంబ సభ్యుల పేర్లను పెట్టుకోవడాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. ప్రాంతీయ పార్టీలను ప్రజలు వదిలించుకునేలా బీజేపీకి మద్దతు పెరిగేలా కష్టపడాలని కార్యకర్తలకు సూచనలు చేశారు. టీడీపీ, వైసీపీలతో బిజెపికి ఎలాంటి సంబంధం లేదని, రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా 2024 ఎన్నికలను ఎదుర్కోవాలని తీర్మానం చేశారు.