ఏపీలో ఈమధ్యకాలంలో ట్వీట్ల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. గతంలో టీడీపీ , జనసేన నేతలపై వైసీపీ ఎంపీ విజయసాయి ఒక రేంజ్ లో ట్వీట్లు చేసేవారు. విజయసాయి ట్వీట్ కి ప్రతిస్పందిస్తూ టీడీపీ నేతలు, జనసేన నేతలు కూడా ట్వీట్ల కౌంటర్లు వేసేవారు. తాజాగా బీజేపీ నేతలు, వైసీపీ నేతల మధ్య ట్వీట్ వార్ జరుగుతోంది.
సంవత్సరానికి 6000 కోట్లు మాత్రమే కాదు!
🔸1. ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన
🔸2.ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ కార్డ్
🔸3.ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన
🔸4. ఇ – నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్
🔸5.ప్రధాన మంత్రి భారతీయ జన్ ఉర్వారక్ పరియోజన….. (1/4)@blsanthosh@JPNadda https://t.co/IL3BZ8K9m9 pic.twitter.com/snkdgoNATV— SOMU VEERRAJU / సోము వీర్రాజు (@somuveerraju) March 1, 2023
ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీటుకు సోము వీర్రాజు కౌంటర్ ట్వీట్ వేశారు. నరేంద్ర మోడీ బ్రెయిన్ ఛైల్డ్ పీఎం కిసాన్ స్కీంకు రూ.6వేల కోట్లు విడుదల చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు ఎంపీ విజయసాయి రెడ్డి. పీఎం కిసాన్ నిమిత్తం రూ. 6 వేల కోట్లే కాదు.. చాలా పథకాలు అమలు చేస్తున్నారంటూ సోము ట్వీట్ చేశారు. మొత్తంగా 24 స్కీంల వివరాలను కోట్ చేస్తూ సోము ట్వీట్ వదిలారు.
1. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన
2.ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ కార్డ్
3.ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన
4. ఇ – నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్
5.ప్రధాన మంత్రి భారతీయ జన్ ఉర్వారక్ పరియోజన…… వంటి పథకాలను ట్వీట్ లో వివరించారు సోము వీర్రాజు.
Hon’ble PM @narendramodi ji released 16,800 crores for farmers under his flagship #PM-KISAN. It will be of great help to the agriculture sector. Over 8 crore farmers received Rs 2000 each directly and Rs 6000 per annum. I appreciate the scheme which is the brainchild of Modi Ji. pic.twitter.com/Xpz9ks2NvS
— Vijayasai Reddy V (@VSReddy_MP) February 27, 2023
రాబోయే ఎన్నికల వేళ ఇలాంటి మాటల యుద్ధాలు మరింతగా చోటుచేసుకునే అవకాశం ఉంది.