మాజీ మంత్రిగా, ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ అధ్యక్షుడిగా.. కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు సీఎం రేసులో నిలబడిన కన్నా లక్ష్మీనారాయణ మౌనం కేడర్‌కు అర్థం కావడం లేదట. గతంలో ఆయన పెదకూరపాడు నుంచి నాలుగుసార్లు వరసగా గెలిచారు. రాజకీయ సమీకరణల్లో భాగంగా గుంటూరు పశ్చిమ ప్రాంతంతో అనుబంధం పెంచుకున్నారు. 2009లో అక్కడి నుంచి కూడా గెలిచారు కన్నా. మంత్రిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన 2014 రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో కొంత ఇబ్బంది పడ్డారు.…
నల్లు ఇంద్రసేనారెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీలో ఓ వెలుగు వెలిగిన నాయకుడు. అప్పట్లో వేళ్లమీద లెక్కపెట్టే బీజేపీ నేతల్లో ఒకరు. గతంలో బీజేపీకి రాష్ట్ర చీఫ్‌గానూ పనిచేశారు ఇంద్రసేనారెడ్డి. ప్రస్తుతం బీజేపీలో ఇతర పార్టీల నాయకుల చేరికలకు సంబంధించిన కమిటీకి ఛైర్మన్‌గా ఉన్నారు. ఇంద్రసేనారెడ్డితోపాటు ఆ కమిటీలో ఏడుగురు పార్టీ నేతలు సభ్యులు. తెలంగాణలో బీజేపీలో ఎవరైనా చేరాలి అని అనుకుంటే ఈ కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. వచ్చేవారి వల్ల పార్టీకి ఏ మేరకు లాభం..…
ఏపీలో శాంతిభద్రతల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి. మంత్రులను మార్చడం కాదు.. ముఖ్యమంత్రి నే మారిస్తేనే పరిస్థితి అదుపులోకి వస్తుంది. సత్యసాయి జిల్లాలో వెనువెంటనే రెండు ఘటనలు జరిగాయి. నిన్న నెల్లూరు లో తుపాకీ తో ప్రేమోన్మాది కాల్చి చంపిన ఘటన విచారకరం అన్నారు. రాష్ట్రం లో చిన్న ఘటనలు జరుగుతున్నా సిఎం స్పందించరా అన్నారు. హోం మంత్రి ఈవిషయాల పై నోరు మెదపరా. గవర్నర్…
ఏపీలో మహిళలపై చోటు చేసుకుంటున్న ఉదంతాలను నిరసిస్తూ నేడు బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టనుంది. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, మహిళల రక్షణలో ప్రభుత్వం వైఫల్యాన్ని నిరసిస్తూ.. ఆందోళనకు పిలుపునిచ్చారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలో బీజేపీ శ్రేణులు నిరసనలు తెలుపనున్నారు. అయితే.. ఏపీలో వరుసగా అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న రేపల్లె రైల్వేస్టేషన్‌లో మహిళపై గ్యాంగ్ రేప్ జరుగగా, ఆ తరువాత…
బీజేపీ నేతలు పదునైన విమర్శలతో వైసీపీని ఇరుకునపెడుతున్నారు. జగన్ కేబినెట్ గురించి బీజేపీ నేతలు ఘాటుస్థాయిలో మండిపడుతున్నారు. తాజాగా ఉత్తరాంధ్ర నీటి ప్రాజెక్టులపై ఏపీ సీఎం జగన్‌కి బీజేపీ చీఫ్ సోము వీర్రాజు బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీల పాత వీడియోని ట్యాగ్ చేస్తూ సీఎంకు లేఖ రాశారు. ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం ఒక రూట్ మ్యాప్ ప్రకటించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర విషయంలో ఉత్తరాంధ్ర…
ఏపీ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ థియోదర్. హిందూ దేవతలను రాష్ట్రంలో అవమానిస్తున్నారు. అంతర్వేది రథదహనంతో ప్రారంభమై అనేక సంఘటనలు హిందువుల మనో భావాలను దెబ్బతీస్తున్నాయి. ఈ సంఘటనలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలి. మైనార్టీల ఓట్ల కోసం హిందూ దేవతలను అవమానిస్తారా? పెదకాకాని ఆలయంలో ముస్లిం వ్యక్తి మాంసం వండటం హైందవ మతాన్ని అవమానించడమే. ఇంత దారుణం జరుగుతుంటే.. పోలీసులు , అధికారులు చోద్యం చూస్తున్నారు. జిన్నా టవర్ పేరు చెప్పగానే…
బీజేపీ-జనసేన పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి. ఏపీలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్బావ వేడుకలు ఘనంగా జరిగాయి. జెండావిష్కరించిన పురంధరేశ్వరి విశాఖ ఉక్కు విషయంలో వైసీపీ నాయకులకు బీజేపీని తప్పు పట్టే అర్హత లేదన్నారు. మిత్ర పక్షంగా పవన్ కళ్యాణ్ మాతో చర్చిస్తే.. మేము కూడా స్పందిస్తాం. ఏపీలో కార్యక్రమాలు వేరైనా . బీజేపీ-జనసేన పొత్తు కొనసాగుతుందన్నారు. https://ntvtelugu.com/ab-venkateshwararao-reply-to-showcause-notice/ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో ప్రజల ఆకాంక్షలను కేంద్ర పెద్దలకు…