మళ్లీ అధికారంలోకి రావాలన్న కాంగ్రెస్ ఆశ నెరవేరదన్నారు కేంద్ర జలశక్తి, ఆహార శుద్ది కర్మాగారాల శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్. ప్రధాని మోడీని ఢీకొనే శక్తి కాంగ్రెసుకు లేదు.మోడీ 100వ మన్ కీ బాత్ పై నాకూ ఆసక్తి ఉంది.100వ మన్ కీ బాత్ లో ప్రధాని ఏం చెబుతారా..? అని నేనూ ఎదురు చూస్తున్నాను.మోడీకి దేశ ప్రజల ఆశీర్వాదం ఉంది.రాహుల్ గాంధీ కలలు కంటున్నారు.ఆయన పని ఆయన చూసుకుంటే మంచిది.విజయవాడ రావడం సంతోషంగా ఉందన్నారు ప్రహ్లాద్ సింగ్ పటేల్.
అంతకుముందు ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మ ను దర్శించుకున్నారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్. తొలుత అమ్మవారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు దుర్గగుడి అధికారులు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు కేంద్రమంత్రి. అనంతరం అమ్మవారి ఆశీర్వచనంతో పాటు తీర్ధ ప్రసాదాలను కేంద్ర మంత్రి కి అందచేశారు అర్చకులు, అధికారులు. దేశంలో చిరు ధాన్యాల ప్రచారాన్ని ప్రధాని మోడీ స్వయంగా తీసుకున్నారు.
Read Also:Man Kills Minor Wife: దారుణం.. భార్య తల, మొండెం వేరు చేసి హత్య..
దేశంలో ప్రజలు భోజనం చేస్తున్నా పౌష్టికాహారం తీసుకోవడం లేదు.చిరు ధాన్యాల ద్వారానే ప్రతీ ఒక్కరికీ పౌష్టికాహారం అందుతుంది.2018 సంవత్సరాన్ని చిరు ధాన్యాల సంవత్సరంగా కేంద్రం ప్రకటించింది.మళ్లీ 2019 నుంచి చిరు ధాన్యాలపై ప్రధాని ప్రత్యేక దృష్టి సారించారు
దేశ ప్రజలకి శుద్ది చేయబడిన తాగునీరు అందించడానికి ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం ప్రాధాన్యత ఇస్తోంది.కేంద్ర బడ్జెట్లో రూ. 60 వేల కోట్ల నుంచి 70,000 కోట్లకి పెంచాం.ఏపీ ప్రభుత్వం తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం దురదృష్డకరం.2024 నాటికి దేశంలోని ప్రతీ ఒక్కరికి శుద్ది చేసిన నీరు అందించాలని ప్రధాని లక్ష్యం అన్నారు ప్రహ్లాద్ సింగ్ పటేల్,
Read Also: Costliest Honey : ఈ తేనే బంగారం కంటే ఖరీదైనది..!