ఏపీలో హిందూ దేవాలయాల విషయంలో విపక్షాలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. విజయవాడలోని కనకదుర్గమ్మ దేవస్థానంఅభివృద్ధికి రూ.80 కోట్లు ఇచ్చిన ఘనత సీఎం వైయస్ జగన్ కి దక్కిందని స్పష్టం చేశారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం 284 సచివాలయం 64 వ డివిజన్ బర్మా కాలనీ పరిధిలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు నిర్వహించారు. హిందూపురంలో పరిపూర్ణానంద స్వామి జీ హిందూ దేవాలయాల గురించి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. స్వామీజీలు సమాజాన్ని సన్మార్గంలో పెట్టాలని హితవు పలికారు.
Read Also:Cred CEO Kunal Shah: ఆ సంస్థ సీఈవో జీతం తెలిస్తే షాకే.. ఏంటి సారు ఇది..?
సమాజంలో అసత్యాలను ప్రచారం చేయడం సరైన పద్దతి కాదన్నారు. హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తున్న ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారాలు చేయటం సమంజసమా అని ఆయన ప్రశ్నించారు. దుర్గమ్మ వారి దేవస్థాన అభివృద్ధికి రూ.80 కోట్లు ఇచ్చిన ఘనత సీఎం వైయస్ జగన్ కి దక్కిందని గుర్తు చేశారు. పుష్కరాల్లో బిజెపి – టిడిపి ఎంత అవినీతి చేశాయో పరిపూర్ణానంద స్వామి సమాధానం చెప్పాలన్నారు. పుష్కరాల్లో అమాయక ప్రజలు చనిపోతే పరిపూర్ణానంద స్వామి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. పరిపూర్ణానంద స్వామీజీ హిందువులని రెచ్చగొట్టడం సరికాదని సూచించారు. టిడిపి ప్రభుత్వంలో విజయవాడ నగరంలో హిందూ దేవాలయాలను కూలగొట్టారు. పరిపూర్ణానంద స్వామి చెప్పినంత మాత్రాన హిందువులందరూ వైయస్ఆర్ సిపి ప్రభుత్వానికి వ్యతిరేకం కాదన్నారు.
Read Also:Rashmika Mandanna: ప్యాంట్ వేసుకోకుండా అక్కడ చేతులు అడ్డుపెడితే ఆగుతారా..?