ఏపీ బీజేపీ నేతలు హస్తినకు వెళ్లారు. నెల రోజుల వ్యవధిలో వీర్రాజు టీం ఇలా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కడం ఇది రెండో సారి. అయితే ఈ సారి టూర్లో రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదులు చేస్తున్నారు. ఏపీలో ఆర్థికశాఖ వ్యవహారంపై కేంద్రానికి కంప్లైంట్ చేశారు. కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ను కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించారు. ఆమెకు వినతిపత్రం అందజేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కేంద్రం ఏ రాష్ట్రానికి నిధులు నిలుపదల చేయలేదన్నారు సోము వీర్రాజు. read also :…
ఏపీ బీజేపీ పూర్తిగా మారిపోయిందా? రోజూ రోడ్డు మీదే ఉంటోందా? ప్రజా సమస్యలు.. పార్టీ కార్యక్రమాలతో బీజీ అయిపోయిందా? ఇంతలోనే అంత ఛేంజ్ ఎలా వచ్చింది? ఈ మార్పు వెనక ఉన్నది ఎవరు? ఢిల్లీకి చెందిన ఆ నేత అంతగా ఎలా ప్రభావం చూపుతున్నారు? ఉత్సాహపరిచారా? ఊరికే కూర్చుంటే ఊరుకోబోమని హెచ్చరించారా? శివప్రకాష్ చెప్పింది చేయకపోతే అసలుకే ఎసరొస్తుందా? ఏపీలో బీజేపీకి ఇంఛార్జ్.. కోఇంఛార్జ్ ఉన్నారు. కేంద్రమంత్రి మురళీధరన్ ఇంఛార్జ్ కాగా.. రాష్ట్రంలో ఉండి పార్టీ కార్యక్రమాల్లో…
రాజమండ్రిలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ… దేశ చరిత్రలో తొలిసారి విద్యలో 10 శాతం ఇ.బి.సి, 27 శాతం ఒ.బి.సి రిజర్వేషన్లు ఇచ్చినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై అన్ని ఆధారాలతో కేంద్రానికి ఫిర్యాదు చేయబోతున్నాం అని చెప్పారు. కృష్ణా, గోదావరి జలాలపై కేంద్రం జారీ చేసిన గెజీట్ తో కేసీఆర్ నోటికి తాళం పడింది. నదీ జలాల్లో కేంద్రం జోక్యాన్ని వ్యతిరేకిస్తున్న చంద్రబాబు ఇకనైనా తన పోకడలు మార్చుకోవాలి…
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొంతమంది ఎమ్మెల్యేలతో హిందూమతాన్ని కించపరిచే విధంగా మాట్లాడిస్తున్నారు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. గోవధచట్టాన్ని రద్దు చేయాలని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే మాట్లాడడంపై ఆగ్రహం. గోమాంసం తినడాన్ని ప్రోత్సహిస్తారా.. భారతీయులను కించపరస్తారా అని పరామర్శించారు. ఎమ్మెల్యే రాజీనామా చేయాలి లేదా ముఖ్యమంత్రి ఎమ్మిగనూరు ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలి. తరచుగా హిందువులను కించపరిచే విధంగా వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ముఖ్యమంత్రి వెంటనే సమాధానం చెప్పాలి. దేవాలయాలు ధ్వంసం చేసిన…
పాత చింతకాయ పచ్చడిలా ఉండే ఏపీ బీజేపీ నేతలు.. రూటు మార్చారా? చేస్తున్నదానికీ.. చేయాల్సిన దానికీ తేడా తెలుసుకున్నారా? రెండేళ్ల తర్వాత ఇప్పుడు లైన్‌లోకి వెళ్లారా? ఏపీ ప్రభుత్వంపై బీజేపీ సమావేశంలో తీవ్ర విమర్శలు! ఏపీ బీజేపీలో రకరకాల గ్రూపులు. అంతా పార్టీ విధేయులైనా ఆయా అంశాలపట్ల ఎవరి తీరు వారిదే. ప్రభుత్వంతో ఎలా ఉండాలి? ప్రధాన ప్రతిపక్షంతో ఎలా వ్యవహరించాలన్న విషయంలోనూ ఎవరి గ్రూప్ వారిదే. అయితే కొద్దిరోజుల క్రితం జరిగిన బీజేపీ రాష్ట్ర కమిటీ…
ఏపీలో బీజేపీకి ఓ సరదా సమస్య వచ్చి పడింది. ముఖ్యనేతల మీటింగ్‌లో అంతర్గత వ్యవహారాల చర్చ బయటకు వెళ్లిపోతుందట. పార్టీలో లోటుపాట్లు, నేతలకు అక్షింతలు సైతం మీడియాలో రావడంతో తలనొప్పిగా మారిందట. దీంతో పార్టీ సమావేశాల్లో అసలు చర్చ కంటే ముందు.. మీటింగ్ సీక్రసీపైనే ఎక్కువ చర్చ జరుగుతుందట. మీటింగ్ అంశాలు ఎవరూ బయట మాట్లాడొద్దని ఒట్టు వేయించుకున్నంత పని చేస్తున్నారట. ఎందుకో ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. పార్టీ మీటింగ్‌లకు రహస్యం అవసరమని భావిస్తున్నారా? ఏపీ…