ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ ఎన్నిక కోసం ఇవాళ నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరిగింది. అయితే టీడీపీ నుంచి చింతకాయల అయ్యన్నపాత్రుడు నామినేషన్ వేశారు. స్పీకర్ పదవి కోసం ఒకే ఒక నామినేషన్ రాగా.. గడువులోగా మరో నామినేషన్ దాఖలు కాలేదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీని నేను ఇదే మొదటిసారి చూడటం అని జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు తెలిపారు. మా ప్రెసిడెంట్, తమ్ముడు శాసన సభలో అడుగుపెట్టినప్పుడు ఒక థ్రిల్ అనిపించిందన్నారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటి (జూన్ 21) నుంచి ప్రారంభం కానున్నాయి. శుక్రవారం ఉదయం 9.46 నిమిషాలకు ఏపీ శాసన సభ ప్రారంభం కానుంది. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలో వచ్చిన తర్వాత తొలిసారి శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. రెండు రోజుల పాటు సభా కార్యక్రమాలు జరగనున్నాయి.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్నికైయ్యారు. ఏడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన గోరంట్లకు ప్రొటెం స్పీకర్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించారు.