వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఈ నెల 19వ తేదీన తుది విచారణకు సిద్ధం అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. దీనికోసం మరోసారి రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు..
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడింది. ఈ సమావేశాల్లో అసెంబ్లీ 9 బిల్లులకు ఆమోదం తెలిపింది. కాగా.. ఈనెల 5న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు మూడు రోజులపాటు జరిగాయి. 10 గంటల 2 నిమిషాల పాటు సమావేశాలు జరిగాయి.
ఏపీలో వైద్యరంగం అభివృద్ధికి చేపట్టిన చర్యలను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన బడ్జెట్ ప్రసంగంలో వివరించారు. వైద్యారోగ్య రంగంలో నాడు నేడు పథకం అమలు చేశామని మంత్రి తెలిపారు. ఉప ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాసుపత్రుల వరకూ 16,852 కోట్లు వ్యయం చేశామని ఆయన వెల్లడించారు. ఫ్యామిలీ డాక్టర్ అనే వినూత్న కార్యక్రమం ద్వారా ప్రజలకు అందుబాటులో వైద్యం తెచ్చామని మంత్రి పేర్కొన్నారు.
ఏడు అంశాల ఆధారంగా బడ్జెట్‌ను రూపకల్పన చేశామని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. సుపరిపాలన, సామర్థ్య ఆంధ్ర, మన మహిళా మహారాణుల ఆంధ్ర, సంపన్నల ఆంధ్ర, సంక్షేమ ఆంధ్ర, భూభద్ర ఆంధ్ర, అన్నపూర్ణ ఆంధ్ర అనే 7 అంశాల ఆధారంగా బడ్జెట్ రూపొందించామన్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. మహాత్మగాంధీ సందేశంతో బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. మేనిఫెస్టోను సీఎం జగన్ ప్రవిత్ర గ్రంథంగా భావించారని పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో పాలన సాగిస్తున్నామని తెలిపారు.
ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశమైంది. మంత్రిమండలి సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2024–25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను మంత్రిమండలి ఆమోదించింది.
ఏపీ అసెంబ్లీలో ఇవాళ కూడా నిన్నటి సీన్ రిపీట్ అయింది. సభ ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రెడ్ లైన్ దాటి స్పీకర్ పోడియం వద్దకు టీడీపీ సభ్యులు వెళ్లారు.