ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రెండో నెంబర్ గేటును స్పీకర్ అయ్యన్నపాత్రుడు తిరిగి ఓపెన్ చేయించారు. గత ప్రభుత్వం గేట్-2 మూసేసి నిర్మించిన గోడను పడగొట్టించి గేట్‌ను స్పీకర్ అయ్యన్నపాత్రుడు పెట్టించారు. రైతుల కష్టాలు వినపడకూడదని ఒక నియంత కట్టుకున్న అడ్డుగోడను తొలగించామని ఆయన అన్నారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఆర్థిక శాఖ తర్జన భర్జన పడుతుంది. బడ్జెట్ కసరత్తును ఓ కొలిక్కి తేలేకపోతోంది ఆర్థిక శాఖ. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టాలా..? రెండు మూడు నెలలకు ఓటాన్ అకౌంట్ పెట్టాలా..? అనే కన్ఫ్యూజన్ లో ఆర్థిక శాఖ ఉంది. ప్రస్తుతం ప్రతిపాదనలకు పూర్తి వివరాల్లేకపోవడంతో పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడం కష్టమనే భావన వినిపిస్తోంది. గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండటంతోనే సమస్య అని ఆర్థిక శాఖ…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన చింతకాయల అయ్యన్నపాత్రుడు బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఎన్నికను ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభలో అధికారికంగా ప్రకటించారు.
అసెంబ్లీ లాబీలో మంత్రి నారా లోకేష్ చిట్ చాట్ నిర్వహించారు. ప్రజా దర్బార్ కొనసాగుతుందని ఆయన తెలిపారు. ప్రజా దర్బార్ ద్వారా చాలా సమస్యలు తన దృష్టికి వస్తున్నాయని మంత్రి వెల్లడించారు.