Anam Ramnarayana Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, వైఎస్ జగన్‌పై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ప్రకాశం జిల్లా పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. జగన్‌కు రైతులపై అకస్మాత్తుగా ప్రత్యేకమైన ప్రేమ పుట్టుకొచ్చిందని ఎద్దేవా చేశారు.. జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఒక్క రైతుని కూడా పరామర్శించలేదన్న ఆయన.. మొంథా తుఫాను ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు శ్రమించారని, తుఫాను సమయంలో ప్రభుత్వం చక్కగా పని చేసిందని ప్రజలంతా ప్రశంసిస్తున్నారని తెలిపారు. అయితే ఉనికి…
Botsa Satyanarayana: అసెంబ్లీ జరుగుతున్న విధానం, బాలకృష్ణ స్పీచ్ చూసిన తర్వాత ఎవరైనా సభకు వెళ్తారా? అని ప్రశ్నించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. అసెంబ్లీ వేదికగా నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల తర్వాత ఎటువంటి చర్యలు తీసుకున్నారో ఇప్పటికీ చెప్పలేదన్నారు.. అటువంటి సభకు వెళ్లి మాట్లాడటం కంటే.. ప్రతిపక్షంగా జనం దగ్గరకు వెళ్లి చెప్పడమే కరెక్ట్… మేం అదే చేస్తున్నాం అన్నారు.. ఇక, సభకు రాని ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకుంటామని చెబుతున్న…
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ మాట్లాడిన వ్యాఖ్యల ప్రభావం ఎలా ఉంటుందో సీఎం చంద్రబాబుకు బాగా తెలుసు… మెగాస్టార్ చిరంజీవిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తప్పనిసరిగా తీవ్ర పరిణామాలు కలిగిస్తాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. గత ప్రభుత్వం లో జరిగిన సినిమా మీటింగ్‌కు సంబంధించి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ అసెంబ్లీలో గత ప్రభుత్వంలో వైఎస్ జగన్.. సినీ ప్రముఖుల సమావేశానికి సంబంధించి చర్చించారు. చిరంజీవి లీడ్ తీసుకోవడం.. గట్టిగా మాట్లాడడం వల్లనే…
Jogi Ramesh: అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కామినేని శ్రీనివాస్ ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. గుంటూరు జిల్లా జైల్లో ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్ట్ తారక్ ప్రతాపరెడ్డిని ములాఖత్ లో పరామర్శించిన మాజీ మంత్రి జోగి రమేష్, గుంటూరు వైసీపీ నేత నూరి ఫాతిమా.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన జోగి రమేష్.. అసెంబ్లీ అంటే పవిత్ర దేవాలయం.. అలాంటి అసెంబ్లీలోకి…
Perni Nani: నందమూరి బాలకృష్ణ, కామినేనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని.. అసెంబ్లీ వేదికగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై బాలకృష్ణ, కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.. కైకలూరు ప్రజల కష్టాలు పట్టని ఎమ్మెల్యే కామినేని అని.. జనం తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నా కామినేనికి పట్టదు. కైకలూరులో దళితులపై జనసేన నేతలు కత్తులతో దాడి చేస్తే మాట్లాడలేదు.. ప్రజల కష్టాల గురించి…
Amaravati: అసెంబ్లీ ఆవరణలోని నూతన భవనాన్ని ప్రారంభించారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు.. ఈ సందర్భంగా నూతన అసెంబ్లీ భవన నిర్మాణాన్ని కూడా త్వరలోనే ప్రారంభించనున్నట్టు వెల్లడించారు.. అసెంబ్లీ ఆవరణలో రూ.3.55 కోట్లతో ఈ భవనం నిర్మాణం చేశాం. మొదటి ఫ్లోర్ లో విప్ లకు కేటాయించాం.. మీడియా పాయింట్ కూడా ఏర్పాటు చేస్తాం అన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు.. ఈ భవనాన్ని ప్రారంభించడం మా అందరికీ…
AP High Court: అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది.. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తించేలా ఆదేశాలు ఇవ్వాలన్న జగన్ పిటిషన్‌పై విచారణ వాయిదా వేసింది.. అయితే, కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మంత్రి పయ్యావుల కేశవ్,…
తనను ప్రతిపక్ష నేతగా గుర్తించేందుకు నిరాకరిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 5వ తేదీన స్పీకర్ రూలింగ్ చట్టవిరుద్ధమైందిగా ప్రకటించాలని పిటిషన్ లో హైకోర్టును కోరారు జగన్.. ఈ రూలింగ్ రద్దు చేయాలని పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు.. ఈ రూలింగ్ ఏపీ పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్ క్వాలిఫికేషన్ చట్టంలో సెక్షన్ 12బీ కి విరుద్ధమని ప్రకటించాలని హైకోర్టును కోరారు జగన్.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో నేడు కీలక చర్చలు జరగనున్నాయి.. దాంతో, పలు సభలో కీలక బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది కూటమి ప్రభుత్వం.. అసెంబ్లీలో నేడు వ్యవసాయ రంగంపై చర్చ జరగనుండగా.. వ్యవసాయ రంగంపై కీలక ప్రకటన చేయనున్నారు సీఎం చంద్రబాబు.