AP Speaker Ayyanna Patrudu: ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా చింతకాయల అయ్యన్నపాత్రుడు
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా సీనియర్ ఎమ్మెల్యే
- మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు
- అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా స్పీకర్‌గా ఎన్నికైనట్టు ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రకటన
- ఏపీ 16వ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవ ఎన్నిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Speaker Ayyanna Patrudu: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎన్నికయ్యారు.. అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా స్పీకర్‌గా ఎన్నికైనట్టు శాసన సభలో ప్రకటించారు ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. దీంతో.. ఏపీ 16వ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఎన్నికయ్యారు.. ఇక, ఆ తర్వాత అయ్యన్నపాత్రుడుని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్.. స్పీకర్ స్థానంలో కూర్చుండబెట్టారు. కాగా, శుక్రవారం సాయంత్రం 5 గంటలకు స్పీకర్ ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ముగిసిన విషయం విదితమే కాగా.. కూటమి నేతలు అయ్యన్నపాత్రుడి తరపున నామినేషన్ దాఖలు చేశారు.. ఇక, ఒకే నామినేషన్ దాఖలు కావడంతో అయ్యన్నపాత్రుడి ఎన్నిక ఏకగ్రీవమైపోయింది..
Read Also: Today Gold Price: గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు! అస్సలు ఊహించరు
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
కాగా, అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయ్యన్నపాత్రుడు.. ఆయనకు నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉంది.. 1983లో తెలుగుదేశం ఆవిర్భావంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన అయ్యన్నపాత్రుడు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా.. ఒకసారి ఎంపీగా గెలిచారు.. ఇప్పటి వరకూ ఐదు ప్రభుత్వాల్లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.. మంత్రిగా సాంకేతిక విద్య, క్రీడా, రహదారులు భవనాలు, అటవీ, పంచాయతీ రాజ్ వంటి కీలక శాఖల బాధ్యతలు నిర్వహించారు.. 1983 నుంచి ఇప్పటి వరకూ 10సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో, 2 సార్లు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశారు.. ఈ సార్వత్రిక ఎన్నికల్లోనూ నర్సీపట్నం అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగి ఘన విజయం సాధించారు అయ్యన్నపాత్రుడు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..