AP Assembly: అసెంబ్లీ రేపటికి వాయిదా.. ఆ ముగ్గురు తప్ప అంతా ప్రమాణం..
- ఆంధ్రప్రదేశ్ శాసన సభ రేపటికి వాయిదా
- ఇవాళ మొత్తంగా 172మంది ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం
- రేపు ఉదయం పదిన్నర గంటలకు తిరిగి ప్రారంభంకానున్న శాసనసభ
- రేపు జీవీ ఆంజనేయులు.. పితాని సత్యనారాయణ.. కొండబాబు ప్రమాణం
- రేపు ఏపీ శాసనసభ స్పీకర్ ఎన్నిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Assembly: ఆంధ్రప్రదేశ్ శాసన సభ రేపటికి వాయిదా పడింది.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఏర్పడిన తర్వాత తొలి అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ఉదయం ప్రారంభం అయ్యాయి.. ఇక, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఆ తర్వాత మంత్రులు.. తదుపరి వైఎస్ జగన్.. ఆ వెనక అక్షర క్రమంలో సభ్యులంతా ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేశారు.. అయితే, అందుబాటులో లేకపోవడం, ఇతరత్రా కారణాల వల్ల కొందరు ఎమ్మెల్యేలు ప్రమాణం చేయేదు.. ఇవాళ మొత్తంగా 172మంది ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు.. వారితో ప్రొటెంస్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించారు.. దీంతో.. అసెంబ్లీ రేపటికి వాయిదా వేశారు.. రేపు ఉదయం పదిన్నర గంటలకు తిరిగి ప్రారంభంకానుంది ఏపీ శాసనసభ.. రేపు ఉదయం మిగిలిపోయిన సభ్యులు జీవీ ఆంజనేయులు, పితాని సత్యనారాయణ, కొండబాబు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయనున్నారు.. సభ్యుల ప్రమాణo తర్వాత స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది.. ఇప్పటికే తమ స్పీకర్ అభ్యర్థిగా సీనియర్ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడుని ఎంపిక చేసింది టీడీపీ కూటమి ప్రభుత్వం.. ఈ రోజు అయ్యన్నపాత్రుడు తరపున కూటమి నేతలు నామినేషన్ దాఖలు చేశారు.. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్న విషయం విదితమే.. కాగా, రేపు స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు.
Also Read
- CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
- YS Jagan: నీటి విడుదలపై పొలిటికల్ వార్.. క్రెడిట్ కోసం చంద్రబాబు ఆరాటం.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
- Yasin Malik: ‘‘నన్ను ఉరితీయక ముందే నిన్ను విముక్తి చేస్తా’’.. భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు
- Jeetendra Mishra: ‘రామ మందిర నిర్వహణ అద్భుతం.. జితేంద్ర మిశ్రా కితాబు
తాజావార్తలు
-
CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
-
YS Jagan: నీటి విడుదలపై పొలిటికల్ వార్.. క్రెడిట్ కోసం చంద్రబాబు ఆరాటం.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
-
CM Revanth Reddy : రాహుల్‌నే ప్రధాని చేయాలి.. వైఎస్సార్‌కు అదే నివాళి
-
Yasin Malik: ‘‘నన్ను ఉరితీయక ముందే నిన్ను విముక్తి చేస్తా’’.. భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు
-
Jeetendra Mishra: ‘రామ మందిర నిర్వహణ అద్భుతం.. జితేంద్ర మిశ్రా కితాబు
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!