విద్య ద్వారానే ఉన్నతిని సాధించగలరని, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితమే ఇందుకు ఒక ఉదాహరణ అని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత అన్నారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా రాజమండ్రిలోని వేంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో గురు పూజోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
Read Also: Covid Vaccine: కోవిడ్ వ్యాక్సిన్, గుండెపోటుకు ఎలాంటి సంబంధం లేదు.. అధ్యయనంలో వెల్లడి..
ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి, జ్యోతి ప్రజ్వలన చేసిన హోంమంత్రి.. ఈ సందర్భంగా తానేటి వనిత మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ కష్టపడి కాకుండా ఇష్టపడి చదివినప్పుడే ఫలితం పొందుతారన్నారు. పిల్లలకు ఏ రంగంలో ఆసక్తి ఉంటే ఆ రంగంలో తల్లిదండ్రులు సరైన శిక్షణ ఇప్పిస్తే తప్పక రాణిస్తారని ఆమె అన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇచ్చారని హోం మంత్రి తెలిపారు.
Read Also: 800 Trailer: గుండెల్ని మెలిపెట్టి వదిలేశారు.. గూజ్ బంప్స్ అంతే!
దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఏపీలో విద్యా రంగానికి వెచ్చించినంతగా వేల కోట్ల రూపాయలు మరే రాష్డ్రంలోనూ వెచ్చించలేదని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. ‘నాడు- నేడు’ ద్వారా వేల కోట్ల రూపాయలతో స్కూల్స్ అభివృద్ధి చేశారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పోరేట్ స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో ఆంగ్ల భాషా బోధన, నాణ్యమైన విద్యను అందించేలా వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆమె చెప్పారు. ఇదొక విప్లవాత్మకమైన అభివృద్ధి అని హోం మంత్రి తానేటి వనిత కొనియాడారు.