ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న సంగతి మనకు తెలిసింది. పరీక్షా సమయం కావడంతో విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడిని అధిగమించి మరీ పరీక్షలు రాస్తున్నారు. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో తాజాగా విద్యార్థులను గుండెపోట్లు సైతం వెంటాడుతున్నాయి. పరీక్షల సమయం కావడంతో విద్యార్థులు నిద్రలేమి కారణంగానో.. మరో ఒత్తిడి కారణంగా తెలియదు కానీ., విద్యార్థులని అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి.
Also Read: Skill Development Case: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్.. సుప్రీంకోర్టులో విచారణ
ఇందులో భాగంగానే తాజాగా టెన్త్ విద్యార్థినికి గుండెపోటు రావడంతో మృతి చెందింది. ఈ సంఘటన కడప జిల్లా రాజుపాలెం మండలం కొర్రపాడు గ్రామంలో చోటుచేసుకుంది. పాఠశాలలో పరీక్షకు ప్రిపేర్ అవుతున్న సమయంలో లిఖిత అనే విద్యార్థి హఠాత్తుగా కుప్పకూలంది. దీన్ని గమనించిన పాఠశాల సిబ్బంది విద్యార్థిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాకపోతే విద్యార్థిని పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆ అమ్మాయి చనిపోయిందని ధృవీకరించారు. విద్యార్థి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.