ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శ నారా లోకేశ్ రెండో రోజు సీఐడీ విచారణ ముగిసింది. ఐఆర్ఆర్ కేసుకు సంబంధించి పలు అంశాలపై సీఐడీ ప్రశ్నలు వేసినట్లు సమాచారం. హెరిటేజ్ ఫుడ్స్ భూముల కొనుగోలు, జీఓఎమ్ నిర్ణయం, లోకేష్ పాత్రపై సీఐడీ ప్రశ్నలు వేసింది.
పురంధేశ్వరిపై సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్లకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. బీజేపీ జోలికి వస్తే సహించమని బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ హెచ్చరించారు. పురంధేశ్వరిపై విమర్శలు చేసే స్థాయి సజ్జలకు లేదని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
స్కిల్ స్కాంలో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయాడని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. నేరం జరగలేదగని చంద్రబాబు నిరూపించగలరా అంటూ ప్రశ్నించారు. ఊరు, పేరు లేకుండా అగ్రిమెంట్ తయారు చేశారని మండిపడ్డారు.
అప్పికొండ బీచ్ లో రాళ్ల మధ్య చిక్కున్న మచిలీపట్నంకి చెందిన కావ్య అనే యువతిని జాలర్లు కాపాడారు. యువతి తన ప్రియుడితో కలిసి బీచ్ కి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె ప్రమాదానికి గురైంది.
బండారు సత్యనారాయణమూర్తి తనపై చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు వెళ్తానని, న్యాయపరంగా పోరాడతానని మంత్రి ఆర్కే రోజా వెల్లడించారు. బండారు లాంటి చీడపురుగులను ఏరిపారేయాలంటూ తీవ్రంగా మండిపడ్డారు. మహిళలను ఒకమాట అనాలంటే భయపడే పరిస్థితి రావాలని ఆమె అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు సోమవారం అత్యంత కీలకంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేసులకు సంబంధించి కోర్టుల్లో ముఖ్యమైన తీర్పులు రేపే వెల్లడికానున్నాయి. విజయవాడ ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు వరకు దాఖలు చేసిన పలు పిటిషన్లపై తీర్పులు, విచారణలు రేపే ఉండడం గమనార్హం.