కొన్ని రాజకీయ పార్టీలకు ఇష్టారాజ్యంగా మాట్లాడటం అలవాటుగా మారిందని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దురదృష్టకరమన్నారు. ప్రజల కోసమో, రాజకీయం కోసమో ఆలోచించుకుని మాట్లాడాలని మంత్రి సూచించారు.
లోకేశ్ సన్నిహితుడు, టీడీపీ నేత గుణ్ణం చంద్రమౌళి ఇంట్లో ఐటీ సోదాలు చేపట్టింది. నారా లోకేశ్‌కు ప్రధాన అనుచరుడిగా ఉన్న గుణ్ణం చంద్రమౌళి ఇంట్లో మూడు బృందాలుగా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.
Jagananna Colony: రాష్ట్రంలో సొంత ఇల్లు లేని వారు ఉండకూడదనేది ఏపీ సీఎం వైఎస్ జగన్ సంకల్పం. ప్రతి అక్క చెల్లి తమ పిల్లలతో సొంత ఇంట్లోనే ఉండాలని ఆయన తలంచాడు. అందులో భాగంగా 30.75 లక్షల మందికి రూ.76,000 కోట్ల విలువైన ఇళ్ల స్థలాలు ఇప్పటికే అందజేశారు.
హైదరాబాద్ నుంచి అమరావతికి తరలివచ్చి ఉచిత వసతి పొందుతున్న ఉద్యోగుల వివరాలపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. విభాగాల వారీగా ఫ్రీ అకామిడేషన్ పొందుతున్న వారి వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది.
రేపు(గురువారం) కాకినాడ జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం బయలుదేరనున్నారు. పది గంటలకు పెద్దాపురం చేరుకోనున్నారు. పది నిమిషాల పాటు స్థానిక నేతలు, కార్యకర్తలతో ఇంటరాక్షన్ కానున్నారు.
వ్యవసాయం, అనుబంధ రంగాలతో పాటు పౌరసరఫరాలశాఖలపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పంటల సాగు, తాజా పరిస్థితులను సీఎంకు అధికారులు వివరించారు. జూన్ నుంచి సెప్టెంబరు వరకూ దాదాపుగా సాధారణ వర్షపాతం నమోదైందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.