పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణకు ప్రమాదం తప్పింది. గోరంట్లలో బైక్ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యేపై ఓ ఆగంతకుడు డిటోనేటర్ విసిరాడు. గోరంట్ల మండలం గడ్డం తండా వద్ద 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శంకరనారాయణ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక రంగాభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. పలు పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
బ్యానర్లు , ఫోటోలు వేసుకున్నంత మాత్రానా లీడర్లు అయిపోయాం అనుకోవద్దని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. నాయకుడు ఏం చెబుతున్నాడో వినండి , దాన్ని ప్రచారం చేయండంటూ జనసేన నేతలకు ఆయన సూచించారు.
ఏపీ లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి వైసీపీ విజయభేరిని మోగించడం ఖాయమని తాజాగా టైమ్స్ నౌ సర్వేలో తేలింది. వైసీపీ ఈ సారి 24 నుంచి 25 లోక్‌సభ స్థానాల్లో గెలిచి క్లీన్‌స్వీప్ చేయనుందని సర్వే స్పష్టం చేసింది. టైమ్స్ నౌ నిర్వహించిన ఈ సర్వేలో వైస్సార్‌సీపీ విజయం తథ్యమని వెల్లడించింది.
సన్నాసి అంటే తిట్టు కాదు.. ఏమి లేనివాడు అని అర్థమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వైసీపీవాళ్లు ఆ మాటకు బాధపడితే భవిష్యత్లో ఆ మాట మాట్లాడను.. అది కూడా వారి ప్రవర్తన బట్టి ఉంటుందన్నారు.