తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక. తిరుమలలో నేటి నుంచి ఐదు రోజుల పాటు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు జరగనున్నాయి. ఆలయం పక్కనే ఉన్న పుష్కరిణిలో స్వామి వారు విహరించనున్నారు.
ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాలోని వివిధ ప్రాంతాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కోస్తా మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. దీని ప్రభావం ప్రధానంగా ఉత్తర కోస్తాపై ఉంటుందని అధికారులు వెల్లడించారు.
నంద్యాల జిల్లా డోన్‌లో ముస్లిం సోదరుల ఇఫ్తార్ విందులో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ సమక్షంలో 500 ముస్లిం కుటుంబాలు వైసీపీలో చేరాయి.
ఏపీలో ఎన్నికల వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. ఈ క్రమంలో నేతలు ఘాటు వ్యాఖ్యులు చేస్తున్నారు. ఈ సారి గెలుపు వైసీదేనని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ఆంధ్రా కుటుంబ సభ్యులందరికీ నమస్కారమంటూ ప్రధాని మోడీ తెలుగులో తమ ప్రసంగాన్ని ప్రారంభించారు. నిన్ననే షెడ్యూల్ విడుదలైందని.. ఎన్డీఏకు నాలుగు వందల సీట్లు రావాలి.. ఎన్డీఏకు ఓటేయాలన్నారు. ఏపీలోని చిలకలూరిపేటలోని బొప్పూడిలో జరిగిన ప్రజాగళం సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఫలితాలు జూన్ 4వ తేదీన రాబోతున్నాయని.. ఫలితం కూడా 400కు పైగా ఎంపీ స్థానాలు రాబోతున్నాయన్నారు. దేశ, రాష్ట్ర ప్రగతి కోసం ఎన్డీఏ రావాలన్నారు.
Praja Galam Public Meeting, PM Modi, Chandrababu, Pawan Kalyan, Chilakaluripeta, Andhrapradesh, AP Elections 2024, Lok Saha Elections 2024, Praja Galam Public Meeting LIVE Updates
సా.5గంటలకు చిలకలూరిపేటలో జరిగే ప్రజాగళం సభలో ప్రధాని పాల్గొననున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఆధ్వర్యంలో ప్రజాగళం సభ జరగనుంది. ఏపీ పర్యటనకు వెళ్తున్నానంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. చంద్రబాబు, పవన్‌తో కలిసి సభలో ప్రసంగిస్తానంటూ.. ఏపీ ప్రజల ఆశీర్వాదాన్ని ఎన్డీఏ కోరుకుంటోందంటూ మోడీ ట్వీట్‌లో పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్తో పాటు అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) వెల్లడించింది. మొత్తం నాలుగు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు జూన్ 4న నిర్వహించనున్నారు.
నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం అంతా టీడీపీ మయం అయిందని.. మండలంలో ఉన్న 24 పంచాయతీల నుండి శుక్రవారం వైసీపీ నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారని ఉదయగిరి టీడీపీ-జనసేన-బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు. వరికుంటపాడు మండలంలో శుక్రవారం ఆత్మీయ సమావేశం టీడీపీ మండల అధ్యక్షుడు చండ్రా మధుసూదన్ రావు ఆధ్వర్యంలో జరిగింది.