Amaravati: ఎన్నికల్లో టీడీపీ గెలిచిన వెంటనే అమరావతికి పూర్వ వైభవం వస్తోంది. గత ప్రభుత్వం విశాఖ రాజధానిగా ప్రకటించి అభివృద్ధి పనులు చేపట్టిన ప్రజలు వాటిని తిరస్కరించారు. అమరావతి వైపే అందరు మొగ్గు చూపారు ఎన్నికల్లో గెలుస్తే అమరావతినే ఏకైక రాజధానిగా అభివృద్ధి చేస్తామని.. రాష్ట్ర యువతకు ఉపాధి కేంద్రంగా మారుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇక ఇచ్చిన ఆ మాట మేరకు పనులు కూడా ప్రారంభమయ్యాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయక ముందే అమరావతి ప్రాంతంలో…
ఏపీ రాజధాని అమరావతిలో తిరిగి పనులు ప్రారంభమయ్యాయి. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి అధికారంలోకి రావటంతో, రోడ్ల వెంట చెట్లు, చెత్తను తొలగించే పనులు మొదలయ్యాయి. ఏపీసీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ శనివారం అమరావతి ప్రాంతంలో పనులను పరిశీలించారు. జేసీబీ యంత్రాలతో పారిశుద్ధ్యం పనులు చేపట్టారు. ఈనెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో, అమరావతిలో అభివృద్ధి పనులు మళ్లీ మొదలయ్యాయి. మరిన్ని వివరాలు కొరకు కింది వీడియో చుడండి.
Moda Kondamma Jatara 2024: మన్యం దేవతైన., గిరిజనుల కల్పవల్లి.. కోరికలు తీర్చే కొంగు బంగారం దేవతగా… ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవంగా.. పాడేరు మోదకొండమ్మ తల్లికి బాగా పేరుంది. ఇక నేటి నుండి అమ్మవారి మూడురోజుల ఉత్సవాలు అంగరంగా వైభవంగా జరగబోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే రెండవ గిరిజన జాతరగా పాడేరు మోదకొండమ్మ జాతరకు బాగా పేరొందింది. రాష్ట్ర విభజన తర్వాత మోదకొండమ్మ జాతర ఆంధ్రప్రదేశ్ లో ప్రథమ స్థానంలో నిలిచింది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుండి…
Monsoon in AP: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ సాధారణం కంటే రెండు రోజుల ముందుగానే కేరళలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు అత్యంత వేగంగా విస్తరిస్తున్నాయి. తాజాగా నైరుతి రుతుపవనాలు ఆదివారం రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించాయి రానున్న రెండు, మూడు రోజులల్లో ఏపీ మొత్తం విస్తరించనున్నాయని ఈ ప్రభావంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో సోమవారం మోస్తరు వర్షాలు, ఎల్లుండి అక్కడక్కడ భారీ…
బంగాళాఖాతంలో కొనసాగుతుంది అల్పపీడనం.. ఇవాళ వాయుగుండంగా మారే ఛాన్స్ ఉంది. ఈ నెల 25వ తేదీ వరకు తుఫాన్ గా మారితే రెమల్‌గా నామకరణం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో రెండు రోజుల పాటు తేలిక పాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీ ప్రజల్ని వాతావరణశాఖ అలర్ట్ చేసింది.. రాష్ట్రంలో వడగాల్పులు కొనసాగుతున్నాయి. రానున్న రెండ్రోజుల పాటు తీవ్ర వడగాల్పులు వీస్తాయని ఏపీ వాతావరణశాఖ హెచ్చరించింది. సోమవారం 31 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 139 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం 33 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 113 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు రెండు జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం నెలకొంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని వైఎస్ఆర్సిపి, తెలుగుదేశం, బిజెపి, కాంగ్రెస్, జనసేన పార్టీలు ఇప్పటికే వారి అభ్యర్థులను ప్రకటించి ప్రతి నియోజకవర్గంలో రాజకీయ సభలను ఏర్పాటు చేసి ప్రజలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇకపోతే తాజాగా నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలం పార్లపల్లిలో ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. Also read: Elections 2024: విజయనగరం…
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అకస్మాత్తుగా బీపీ, షుగర్ లెవెల్స్ పెరగడంతో ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన విశాఖలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.