ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కోసం తెలుగుదేశం - జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఎన్నికల్లో గెలుపు గుర్రాల బరిలోకి దింపడం ద్వారా విజయం సాధించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దీంట్లో భాగంగా అనేకసార్లు ఇరుపార్టీలు అధినేతలు సమావేశమై అభ్యర్థులు ఎంపికపై కసరత్తు పూర్తి చేశారు.
ఎన్నికల వేళ ఏపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడంపై స్పష్టత రాకున్నా వైసీపీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైసీపీ చివరి సిద్ధం సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిద్ధం సభ ద్వారా వైసీపీ శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు వివరించనున్నారు. రానున్న ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను కూడా విడుదల చేసే అవకాశం ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరగుతున్నాయి. ఉదయం నుంచే శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు కొనసాగుతున్నాయి.
ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో సీఎం జగన్ పర్యటనలను పెంచారు. ఈ నెల 7,8 తేదీల్లో సీఎం వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. పులివెందులలో పలు అభివృద్ది పనులను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.
రాష్ట్ర డీజీపీకి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. నామినేషన్‌లో పొందుపరిచేందుకు తనపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలని లేఖ రాశారు. 2019 తరువాత వివిధ జిల్లాల్లో తనపై పోలీసులు పెట్టిన కేసుల వివరాలు తెలపాలని లేఖలో కోరారు.
ఏపీ రాజధానిపై సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల తర్వాత ఏపీ రాజధానిగా విశాఖ ఉంటుందని అన్నారు. ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఇక్కడే సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానని.. ఎన్నికల తర్వాత విశాఖలోనే ఉంటామన్నారు.
ప్రస్తుతం జరుగు (2024) సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో.. చేనేత వర్గాలైన కుర్నీ (నేసే), పద్మశాలిల పూర్తి మద్దతు స్వర్గీయ పద్మశ్రీ మాచాని సోమప్ప ముని మనవడు మాచాని సోమనాథ్కు ఉంటుందని ఎమ్మిగనూరు చేనేతల ఐక్యవేదిక నాయకులు తెలిపారు.