Pawan Kalyan: ఇప్పటివరకు ఎన్నో పొలిటికల్ యాడ్స్ చూసే ఉంటారు. అన్నింటిలో ప్రజలకు అది చేస్తాం.. ఇది చేస్తాం.. మమ్మల్ని గెలిపించండి అనో.. లేకపోతే గ్రామాల్లో ఉన్న ప్రజల వద్దకు వెళ్లి తమ పార్టీ గుర్తును చూపించి.. అప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయి.. ఇప్పుడు ఎలా ఉన్నాయి. రేపు తాము గెలిస్తే ఎలా అంటుంది అని చూపిస్తూ ఉంటారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం వైసీపీ ఇన్‌ఛార్జ్ బుట్టా రేణుకపై తీవ్రంగా మండిపడ్డారు టీడీపీ నేత మాచాని సోమనాథ్. మాచాని సోమప్ప ఎక్కడైతే అభివృద్ధిని వదిలేసారో.. వాటన్నిటిని ముందుకు తీసుకెళ్తానని, చేనేత అభివృద్ధికి పాటుపడుతానని ఇటీవల చేనేత ఆత్మీయ సమ్మేళన సభలో బుట్టా రేణుక చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు.
టీడీపీ ఇటీవల 94 మందితో అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవాళ చంద్రబాబు మాట్లాడుతూ, వీలైనంత మంది టీడీపీ అభ్యర్థులతో రెండో జాబితాను రేపు ప్రకటిస్తామని వెల్లడించారు. టీడీపీ అభ్యర్థుల జాబితా కసరత్తులు తుది దశకు చేరుకున్నాయని ఆయన వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. తన 59 ఏళ్ల భర్త దారుణ హత్యను చూసిన అనంతరం 56 ఏళ్ల వయస్సు గల భార్య ఆదివారం అర్థరాత్రి గుండెపోటుతో మరణించింది.
రైతులకు ధాన్యం డబ్బులు వెంటనే చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మిగిలి ఉన్న ధాన్యాన్ని వెంటనే గిట్టుబాటు ధరకు సేకరించాలని ఆయన సర్కారును కోరారు. ప్రభుత్వ మొండి వైఖరి నశించాలంటూ రైతులతో కలిసి పెనమలూరు నియోజకవర్గంలో ఆయన నిరసన చేపట్టారు.
బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద చివరి సిద్ధం సభ గురించి మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. చివరి సిద్ధం సభ సూపర్ సక్సెస్ అవుతుందని ఆయన అన్నారు. 15 లక్షలకు మించి ప్రజలు హాజరవుతారన్నారు. ఈ సభ మాకు ఎన్నికల ప్రచారం లాంటిదన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల రాజకీయం వేడెక్కింది. ఈ క్రమంలోనే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 16 నుంచి వైసీపీ ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు.
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీలు ప్రచారంలో వేగం పెంచాయి. బీజేపీ కూడా పొత్తులపై క్లారిటీ ఇవ్వడంతో ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బీజేపీ కూడా ఇప్పటి నుంచి ప్రచారంలో దూసుకుపోయేందుకు సిద్ధమైంది.
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తన వైసీపీ చేరికపై స్పష్టత ఇచ్చారు. ఆయనే స్వయంగా స్పందించారు. ఈనెల 14న వైసీపీలో చేరుతున్నానని ముద్రగడ పద్మనాభం చెప్పారు. ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు వైఎస్సార్సీపీలో చేరుతున్నానని వెల్లడించారు.