ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారడంతో తమ ఇబ్బందులను తెలియచేయడానికి నిర్ణయించుకొని. నేడు కొందరు ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలు.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ ను కలవబోతున్నారు. టాలీవుడ్ సినీ దర్శకులు అశ్వినీదత్, చినబాబు, ఏ.ఎన్.ఐ. నవీన్, రవిశంకర్, డి.వి.వి. ధనయ్య, బోగవల్లి ప్రసాద్, విశ్వ ప్రసాద్, నాగ వంశీల, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ డైరెక్టర్ దిల్రాజు, కార్యదర్శి దామోదర్ ప్రసాద్ భేటీ కానున్నారు చిత్ర పరిశ్రమ సమస్యలని సినీ నిర్మాతలు , పవన్ కళ్యాణ్…
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం పరిపాలన ప్రారంభించిన నేపథ్యంలో తొలిసారిగా మంత్రివర్గం సమావేశం కానుంది. నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న కేబినెట్ సమావేశంలో ప్రభుత్వ ప్రాధాన్యతలపై సీఎం చంద్రబాబు తన మంత్రివర్గ సహచరులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలో వాగ్దానాల అమలు, రాష్ట్ర రాజధాని, పోలవరం ప్రాజెక్టు తదితర అంశాలపై చర్చించనున్నారు. ఎనిమిది శాఖలకు సంబంధించిన శ్వేతపత్రాలు విడుదలపై కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకునే…
బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో యువతి హత్యకు గురైన ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఘటనలో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో పోలీసులు కేసును ప్రతిష్టాత్మకంగ తీసుకున్నారు. ఐదు ప్రత్యేక బృందాలతో నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 48 గంటల్లో కేసును ఛేదించేందుకు కసరత్తు చేస్తున్నారు.హోంమంత్రి వంగలపూడి అనిత సంఘటనా స్థలాని పరిశీలించారు. బాధిత కుటుంబాన్ని కలిసి ప్రభుత్వం అండగా ఉంటుంది అని హామీ ఇచ్చారు…
Viswambhara Set’s: మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “విశ్వంభర”. ఈ సినిమాను బింబిసార ఫేమ్ వశిష్ఠ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక మెగాస్టార్ పక్కన త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మరో కీలక పాత్రలో ఖుష్బూ నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి…
AP Deputy CM Pawan Kalyan Chamber: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించే రోజు ఖరారైంది. జూన్ 19వ తేదీ బుధవారం రోజు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారు. అలాగే కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను పవన్ కళ్యాణ్‌కు కేటాయించారు. దీనిపై ఇప్పటికే సంతోషం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. జనసేన మూల సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్న శాఖలను తమకు…
సీఎం చంద్రబాబు సచివాలయంలో జలవనరులశాఖ అధికారులతో భేటీ అయ్యారు. పోలవరం సహా వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సోమవారం పోలవరం ప్రాజెక్టును సీఎం సందర్శించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. జిల్లాల్లో నియోజకవర్గాల్లో కొత్త మంత్రుల పర్యటన పూర్తయ్యాక తొలి క్యాబినెట్ భేటీ నిర్వహిస్తున్నారు. పోలవరం పర్యటన పూర్తయ్యాక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. శాఖలపై పట్టు పెంచాలని, పాలనా పరంగా పూర్తి స్థాయి అవగాహన పెంచాలని మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో మూడు పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నుకోబడ్డారు. దీంతో జనసేన నేతలు, కార్యకర్తలు, ముఖ్యంగా పిఠాపురం ప్రజలు ఆనందోత్సాహాల్లో మునిగితేలుతున్నారు. తనను కలవడానికి ప్రజలు ఇబ్బందులు పడవద్దని, తానే త్వరలో జిల్లాల్లో పర్యటిస్తానని వెల్లడించారు. ఇక జనసేన విజయ పర్యటన టూర్ గురించి తెలుసుకోవాలి అంటే కచ్చితంగా కింది వీడియో చుడాలిసిందే.
2024 ఎన్నికల ప్రచారంలో పింఛన్‌ను రూ.4,000లకు పెంచుతామని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఇచ్చిన మాట ప్రకారం నిన్న సచివాలయంలో 4000 పింఛన్‌ను పెంపుపైన మూడో సంతకం చేసారు. అలానే పెన్షన్ పేరును ఎన్టీఆర్ భరోసాగా మార్చారు. ఇకపోతే దివ్యంగుల పింఛన్‌ను రూ.6,000లకు పెంచుతామని హామీ ఇచ్చారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, తదితర విభాగాల వారికి జులై 1న పెంచిన పింఛన్ రూ.4,000 అందించనున్నారు. అలాగే ఏప్రిల్, మే, జూన్ నెలలకు గాను రూ.1,000 చొప్పున…
వైసీపీ ఎమ్మెల్సీలతో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీలతో జగన్ సమావేశమయ్యారు. రానున్న శాసనమండలి వ్యూహంపై చర్చించినట్లు సమాచారం. పలు అంశాలపై ఎమ్మెల్సీలకు జగన్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. శాసన సభ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మండలిలో వైసీపీ బలం పుంజుకోవడంతో అక్కడ అనుసరించాల్సిన వ్యూహంపై జగన్ చర్చించినట్లు తెలుస్తోంది.