ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారడంతో తమ ఇబ్బందులను తెలియచేయడానికి నిర్ణయించుకొని. నేడు కొందరు ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలు.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ ను కలవబోతున్నారు. టాలీవుడ్ సినీ దర్శకులు అశ్వినీదత్, చినబాబు, ఏ.ఎన్.ఐ. నవీన్, రవిశంకర్, డి.వి.వి. ధనయ్య, బోగవల్లి ప్రసాద్, విశ్వ ప్రసాద్, నాగ వంశీల, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ డైరెక్టర్ దిల్రాజు, కార్యదర్శి దామోదర్ ప్రసాద్ భేటీ కానున్నారు చిత్ర పరిశ్రమ సమస్యలని సినీ నిర్మాతలు , పవన్ కళ్యాణ్ కు వివరించనున్నారు సినిమా టిక్కెట్ల ధరల పెంపు వెసులుబాటు పై కూడా, ఈ సమావేశంలో చర్చించుకునే అవకాశం ఉంది. థియేటర్ల సమస్యలను కూడా నిర్మాతలు పవన్ దృష్టికి తీసుకువెళ్లనున్నారు. ఈ భేటీలో సినిమాటోగ్రఫీ మంత్రి కంతుల దుర్గేష్ కూడా పాల్గునే ఛాన్స్ ఉంది.