సీఎం చంద్రబాబు సచివాలయంలో జలవనరులశాఖ అధికారులతో భేటీ అయ్యారు. పోలవరం సహా వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సోమవారం పోలవరం ప్రాజెక్టును సీఎం సందర్శించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. జిల్లాల్లో నియోజకవర్గాల్లో కొత్త మంత్రుల పర్యటన పూర్తయ్యాక తొలి క్యాబినెట్ భేటీ నిర్వహిస్తున్నారు. పోలవరం పర్యటన పూర్తయ్యాక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. శాఖలపై పట్టు పెంచాలని, పాలనా పరంగా పూర్తి స్థాయి అవగాహన పెంచాలని మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.