Viswambhara Set’s: మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “విశ్వంభర”. ఈ సినిమాను బింబిసార ఫేమ్ వశిష్ఠ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక మెగాస్టార్ పక్కన త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మరో కీలక పాత్రలో ఖుష్బూ నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. దీనితో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇక ఏ సినిమా షూటింగ్ జరుగుతున్న ప్రదేశంలోకి ఆంధ్రా ప్రదేశ్ పర్యాటక & సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కందుల దుర్గేష్ వెళ్లి పలకరించారు. ఈ క్రమంలో చిరంజీవి ఆయన్ని మర్యాదపూర్వకంగా పలకరించి ఆంధ్రప్రదేశ్ పర్యాటక & సినిమాటోగ్రఫీ రంగానికి సంబంధించి వ్యాఖ్యలు చేసారు.
Also Read: Klin Kaara : క్లింకారా ఫస్ట్ బర్త్ డే.. ఉపాసన ఎమోషనల్ పోస్ట్ వైరల్..
మిత్రుడు శ్రీ కందుల దుర్గేష్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక & సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న సందర్భంగా ‘విశ్వంభర’ సెట్స్‌పై ఆయనకు స్వాగతం పలకడం ఎంతో ఆనందంగా ఉంది. మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించడంలో ఆయన సంపూర్ణ విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి , ఎదుర్కొంటున్న సవాళ్లను సత్వరం పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటానని చెప్పారు. ఆయన సానుకూలతకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు. అలాగే పర్యాటకరంగంలో అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి వున్న ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పర్యాటక స్థలాల్ని పూర్తిగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాను, విశ్వసిస్తున్నాను అని చెప్పుకొచ్చారు.