CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు తిరుపతికి వెళ్లనున్నారు. తిరుపతిలోని తాజ్ హోటల్‌లో జరిగే ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో సీఎం జగన్, మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొననున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో అమలవుతున్న సంస్కరణలపై ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. ఈ మేరకు పర్యటన వివరాలను సీఎంవో వెల్లడించింది.
Read Also: YS SHarmila: మాజీ మంత్రి కొణతాల ఇంటికి వైఎస్ షర్మిల.. మేం అంతా కుటుంబ సభ్యులం..
మధ్యాహ్నం 2.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం బయలుదేరి వెళ్లనున్నారు. తిరుపతిలోని తాజ్ హోటల్‌లో జరిగే ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి పాల్గొని.. అనంతరం తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు. ముఖ్యమంత్రి తిరుపతి పర్యటన కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.