ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రేపు మంగళగిరిలో టీడీపీ 'జయహో బీసీ' బహిరంగ సభను పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు చేసింది. బహిరంగ సభలో టీడీపీ- జనసేన కూటమి బీసీ డిక్లరేషన్ ప్రకటించనుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన టెట్, టీఆర్టీ(టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్) నోటిఫికేషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పరీక్షల షెడ్యూల్ మార్చాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఈ రెండు పరీక్షల మధ్య 4 వారాల సమయం ఉండాలని పేర్కొంది.
బాపట్ల జిల్లా బాపట్ల మండలంలోని ఈతేరు-చుండూరుపల్లి గ్రామాల ప్రధాన రహదారిలో రోడ్డు ప్రమాదం జరిగింది. శవణం గోపిరెడ్డి (30)అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
ఏపీలో బీజేపీ రెండు రోజుల కీలక సమావేశాలు ముగిశాయి. పార్టీ ముఖ్య నేతలు, జిల్లాల్లోని కీలక నేతలతో జాతీయ సహ సంఘటనా కార్యదర్శి శివ ప్రకాష్ వరుస సమావేశాలు నిర్వహించారు.
కృష్ణా జిల్లాలోని గుడివాడలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో భారీగా మైనార్టీలు చేరారు. ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో , వైయస్ఆర్సీపీలో 500 మంది టీడీపీకి మైనార్టీలు జాయిన్ అయ్యారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం నీరుగుట్టివారిపల్లెలో ఓ కుమారుడు తన తల్లిదండ్రుల పట్ల పశువులా ప్రవర్తించాడు. తల్లిదండ్రులపై పట్ల మానవత్వం లేకుండా ఆ కొడుకు మృగంలా వ్యవహరించాడు. ఆస్తికోసం నడిరోడ్డుపై తల్లిదండ్రులను ఆ కసాయి కొడుకు చితకబాదాడు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి ఆదిమూలపు సురేష్ ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ నిజంగా వామనుడే.. బలి చక్రవర్తి చంద్రబాబును పవన్ తొక్కబోతున్నాడు.. అది బాబు గమనించాలని ఎద్దేవా చేశారు.