Vemireddy Prabhakar Reddy: రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శనివారం టీడీపీలో చేరారు. టీడీపీ కండువాతో ఆయనను చంద్రబాబు నాయుడు తమ పార్టీలోకి ఆహ్వానించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంతి రెడ్ది, నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కూడా టీడీపీలో చేరారు. నెల్లూరులోని పీవీఆర్ కన్వెక్షన్ సెంటర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజకీయాలకు గౌరవం తెచ్చే వ్యక్తులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని.. వేమిరెడ్డి రాకతో నెల్లూరు జిల్లాలో ఈజీగా గెలవబోతున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు.
Read Also: Vijayasai Reddy: 100 ఎకరాల్లో 15 లక్షల మంది పాల్గొనేలా మేదరమెట్ల ‘సిద్ధం’ మహాసభ
ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. నా కృషి. దేవుడి ఆశీస్సుల మేరకు ప్రజలకు సేవ చేస్తుంటానని అన్నారు. రాజకీయాల్లోకి వస్తే మరింత సేవ చేయవచ్చని సన్నిహితులు చెప్పడంతో తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. దైవ నిర్ణయంతో టీడీపీలో చేరుతున్నానని.. ఈ సందర్భంగా చాలా సంతోషంగా ఉందన్నారు. మీ అందరి మద్దతు నాకు అవసరమని నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రజలకు ఉపయోగపడే మరిన్ని మంచి పనులు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. టీడీపీలో చేరిన ప్రతి ఒక్కరికీ మీ మనిషిగా ఉంటూ సేవలందిస్తామన్నారు. నెల్లూరు నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్నానని.. అందరూ ఆశీర్వదించాలని కోరారు.