Vijayasai Reddy: మేదరమెట్ల జాతీయ రహదారి పక్కన 4వ చివరి సిద్దం మహాసభ నిర్వహిస్తున్నామని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. సిద్ధం సభ అనంతరం ఎన్నికల ప్రచారం మెుదలవుతుందన్నారు. సభా వేదిక కేంద్రంగా రాష్ట్ర వైసీపీ క్యాడర్‌కు సీఎం జగన్ దిశ, దశను నిర్దేశిస్తారని ఆయన వెల్లడించారు. అధికారం చేపట్టిన అనంతరం వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ళలో చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని సీఎం జగన్ ప్రజలకు వివరిస్తారని తెలిపారు.
Read Also: Purandeswari: అవినీతి రహిత, వారసత్వ రహిత పాలనను మోడీ అందిస్తున్నారు..
సభా వేదికగా వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏమి చేయబోతున్నామో మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నామన్నారు. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే 175కు 175 సాదిస్తామనే విషయంలో ఎటువంటి అనుమానాలు లేవన్నారు. సభ మొత్తం 100 ఎకరాల్లో 15 లక్షల మంది పాల్గొనేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఆరు పార్లమెంట్ స్థానాలు, జిల్లాల నుంచి ప్రజలు ఈ సభకు హాజరవుతారని విజయసాయిరెడ్డి తెలిపారు.ఇప్పటి వరకు జరిగిన సిద్దం సభల స్పందనను చూస్తే వైసీపీ తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వస్తుందనారంలో ఎటువంటి అనుమానం లేదన్నారు. మా పాలన, సంక్షేమం చూసి బిసీలు వైసీపీ వైపు ఆకర్షితులయ్యారని ఆయన పేర్కొన్నారు. సభలో ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు.