ఎండలు మండుతున్నాయి. ఉదయం నుంచే ఉక్కపోత మొదలవుతోంది. బయటికి వెళ్లాలంటే భయం పుట్టిస్తున్నాడు భానుడు. ఇప్పుడే ఇలా ఉంటే.. ఏప్రిల్‌లో ఎలా ఉంటుందోనని భయం వేస్తోంది. ప్రస్తుతం అన్ని కాలాలు ఆలస్యంగా ప్రారంభం అవుతున్నాయి. పోయిన ఏడాది చలికాలంలోనూ ఎండలు దంచికొట్టాయి.
ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఎన్నికలు వస్తుండటంతో అధికార, ప్రతిపక్షాలు కాలు దువ్వుకుంటున్నాయి. టీడీపీ-జనసేన కూటమి ఆధ్వర్యంలో ఇవాళ జయహో బీసీ సభ జరగనుంది.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేటితో 5వరోజుకు చేరుకున్నాయి.
ప్రముఖ మహానంది క్షేత్రంలో 6 నుండి 11వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ప్రతిరోజు అభిషేకాలు, విశేష పూజలు, వాహన సేవలు నిర్వహించనున్నారు. 8వ తేదీ రాత్రి 10 గంటలకు లింగోద్భవ కాలంలో మహా రుద్రాభిషేకం చేపట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ చాలా మంది పార్టీలు మారుతున్నారు. అధికార వైసీపీలోకి భారీగా చేరికలు కనిపిస్తున్నాయి. ఆళ్లగడ్డ బీజేపీ ఇన్‌ఛార్జి భూమా కిషోర్ రెడ్డి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చిన ఆయన.. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్డీ కండువా కప్పుకున్నారు.
పాతికేళ్ల కాలం నుంచి రాజమండ్రి బాగా తెలుసని.. గడిచిన ఐదేళ్లలో రాజమండ్రి డెవలప్మెంట్ కనిపిస్తుందని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఒక ప్రజా ప్రతినిధి చిత్తశుద్ధితో తన ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తే ఎలా ఉంటుందో మార్గాని భరత్‌ను చూస్తే అర్థమవుతుందన్నారు.
తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావును ఉద్దేశించి ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఉద్యమం పేరిట చంద్రబాబు పంపిస్తే హైదరాబాద్ నుంచి వచ్చాడని కేశినేని తెలిపారు. అప్పుడు చంద్రబాబు చెబితే తానే ఆయనను మూడు నెలలు హోటల్‌లో పెట్టానని.. అతని అరాచకాలు భరించలేక హోటల్ వారే గగ్గోలు పెట్టేవారని ఆయన చెప్పారు.
రేపు(మంగళవారం) సీఎం వైఎస్ జగన్మోహన్ విశాఖలో పర్యటించనున్నారు. పారిశ్రామిక, వ్యాపార వేత్తల సదస్సుకు సీఎం జగన్ హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్ డెవలప్‌మెంట్ పేరుతో కీలక ఉపన్యాసం ఇవ్వనున్నారు ముఖ్యమంత్రి జగన్. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు జగన్.. అనంతరం భవిత పేరుతో కొత్త కార్యక్రమం ప్రారంభించనున్నారు.
నంద్యాల జిల్లా అవుకు బస్టాండ్లో దారుణం జరిగింది. భార్య, అత్తపై ఓ వ్యక్తి కత్తితో కిరాతకంగా దాడికి పాల్పడ్డాడు. అందరూ చూస్తుండగానే కత్తితో దాడికి దిగాడు. భార్యపై అనుమానంతో రంగస్వామి అనే వ్యక్తి విచక్షణారహితంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. అనుమానం అనే పెనుభూతం వల్లే అతడు కత్తితో నరికినట్లు తెలిసింది.
టీడీపీ-జనసేన కలయిక ఒక పాశుపతాస్త్రమని.. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో టీడీపీ 'రా కదలి రా' బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. రాయలసీమకు నీళ్లు, పెట్టుబడులు, ఉద్యోగాలపైనే దృష్టి పెట్టామన్నారు. 18 నెలల్లో గొల్లపల్లి రిజర్వాయర్ను పూర్తి చేసి కియా పరిశ్రమను తీసుకొచ్చామని.. ఇప్పుడు ఎకరా 2 కోట్లు ఉంది, మనం ఉంటే ఎకరా 5 కోట్లు అయ్యేదని ఆయన అన్నారు.