ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు వస్తున్న వేళ.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ముందస్తుకు వెళ్లే ఆలోచన వైసీపీకి లేదని చెప్పారు.
రాష్ట్రంలో పెట్టుబడులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో వచ్చిన పెట్టుబడులపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారులతో కలిసి ఒడిశాలో రైలు ప్రమాద ఘటనాస్థలికి వెళ్లినట్లు మంత్రి గుడివాడ అమర్‌నాథ్ వెల్లడించారు. సీఎం ఆదేశాలతో బాధితులకు సాయం అందేలా చూస్తున్నామన్నారు.
ఓవైపు ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం, దాని వివరాల్ని తెలుసుకుంటూ బాధపడతూనే ఉన్నాం. ఇలాంటి సమయంలో.. మరో రైలు ప్రమాదం జరగబోయి.. అంతలో ఆగింది. అది కూడా జరిగివుంటే.. మరో దుర్వార్త అయ్యేది.
ఒడిశా రైలు ప్రమాద బాధితులకు ఆంధ్రప్రదేశ్ సర్కారు ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి రూ.10 లక్షలు అందించనుండగా.. గాయపడిన వారికి రూ.లక్ష పరిహారం ఇవ్వనుంది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది.