Kakarla Suresh: ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్‌కు అల్లా ఆశీస్సులు ఉండాలని ముస్లిం సోదరులు మాసాయిపేట మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ మాస పర్వదినాన్ని పురస్కరించుకొని దీక్ష భూనిన ముస్లిం సోదరులతో కలిసి ఉదయగిరి ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ బుధవారం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ముందుగా ముస్లిం సోదరులు కాకర్ల సురేష్ ఘన స్వాగతం పలికారు. అనంతరం మాసాయిపేట మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. రంజాన్పర్వదినాన్ని పురస్కరించుకొని దీక్ష చేస్తున్న వారందరూ విజయవంతంగా దీక్షను పూర్తి చేయాలన్నారు. అల్లా వారి కోర్కెలను నెరవేర్చాలని ప్రార్థించారు. ముస్లిం సోదరులకు, సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి జోత్స్న, మండల కన్వీనర్ బయన్న, స్థానిక ముస్లిం సోదరులు, సోదరీమణులు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
ఉదయగిరి పట్టణంలో బుధవారం సాయంత్రం పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమంలో భాగంగా ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పట్టణంలో ప్రధాన రహదారి వెంబడి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి దుకాణదారుడి వద్దకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. టిఫిన్ సెంటర్ వద్ద బోండాలను వేసి అబ్బురపరిచారు. షాప్ యజమానులతో మమేకమై వారి బాధలు తెలుసుకుని టీడీపీ అధికారంలోకి రాగానే అన్ని కష్టాలు తీరుస్తామని హామీ ఇచ్చారు. పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అనంతరం టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జోత్స్న మాట్లాడుతూ.. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే నాయకులు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్‌లు అని ఆమె తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమించే శ్రామికుడు టీడీపీ అధినేత చంద్రబాబు అని పేర్కొన్నారు. ఎంతో అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు అని, ఆయనను ముఖ్యమంత్రి చేసుకుంటే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందన్నారు.
అదేవిధంగా అలుపెరుగని పోరాట యోధుడు నారా లోకేష్ అని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకున్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జోత్స్న అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే అందరి బాధలు తీరుతాయని, అభివృద్ధి సాధ్యమవుతుందని ఆమె అన్నారు. తెలుగుదేశం గెలుపు రాష్ట్రానికి మలుపు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బయన్న, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు కలివెల జ్యోతి, శైలజ అక్కమ్మ, ఆకుల అరుణమ్మ, వెంగళరావు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.