ఏపీలో ఇంటింటికి అందుతున్న సంక్షేమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో భాగంగా నాయుడుపేట బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. నాయుడుపేట జన సముద్రాన్ని తలపిస్తోందని సీఎం అన్నారు.
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల వేళ బాపట్ల జిల్లా చీరాలలో వైసీపీకి షాక్ తగిలింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ రాజీనామా చేశారు.
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానికులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో మూడు జిల్లాలకు కలెక్టర్లు, ఐదు జిల్లాలకు ఎస్పీల నియామకం జరిగింది. ఇటీవల కొందరు జిల్లా ఎస్పీలు, కలెక్టర్లపై ఎన్నికల కమిషన్ బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. ముగ్గురు ఐఏఎస్‌లతోపాటు, 6గురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రైల్వేకోడూరు అసెంబ్లీ అభ్యర్థిని జనసేన అధిష్ఠానం మార్చేసింది. రైల్వే కోడూరు అసెంబ్లీ జనసేన అభ్యర్థిగా అరవ శ్రీధర్ పేరును పవన్ ఖరారు చేశారు.
అనపర్తి నుంచి టీడీపీ అభ్యర్దిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరు ప్రకటించిన తరువాత ఆ సీటు బీజేపీకి కేటాయించారు. ఈ క్రమంలోనే ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో బీజేపీ నేతల మంతనాలు జరుపుతున్నారు. బీజేపీలో చేరాలని ఆయనను ఆహ్వానిస్తున్నారు.
ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టిన 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ఆయన చేపట్టిన ఈ యాత్ర గురువారం మధ్యాహ్నం తిరుపతి జిల్లా చిన్నసింగమలకు చేరుకుంది. చిన్నసింగమలలో లారీ, ఆటో డ్రైవర్లతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ముద్రగడ పద్మనాభం ఫైర్ అయ్యారు. హైదరాబాద్, విజయవాడలో ఉన్న ఆస్తులు అమ్మేసి పిఠాపురం వచ్చేయమనండి.. అప్పుడు గౌరవం ఇస్తామని ఆయన అన్నారు.