కర్నూలు జిల్లా కూటమిలో మంటలు చల్లారడం లేదు. కూటమిలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎమ్మిగనూరు, మంత్రాలయంలో టీడీపీతో మిత్రపక్షాలు ఢీకొట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
జనసేనలో అనుభవం ఉన్న ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి వైసీపీలోకి రావడం హర్షణీయమని నెల్లూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి అన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి వైసీపీలోకి రావడాన్ని చూస్తే జనసేన ఎంత బలహీనంగా ఉందో అర్థమవుతుందన్నారు.
ఏపీలో ఎన్నికల వేళ.. ఈసీ వద్ద వివిధ పార్టీల ఫిర్యాదులతో పంచాయతీ నెలకొంది. ప్రతి ఎన్నికల్లోనూ ఉండే తరహాలోనే ఈ ఎన్నికల్లోనూ ఒకరిపై ఒకరు ఈసీకి అధికార-ప్రతిపక్ష పార్టీలు పరస్పర కంప్లైంట్లు ఇచ్చుకుంటున్నారు. షెడ్యూల్ విడుదల కాక ముందు నుంచి వైసీపీ - టీడీపీ పార్టీలు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నాయి.
ఏపీలో ఇటీవల భర్తలు, భార్యల హత్యలు కలకలం రేపుతున్నాయి. ప్రతి నిత్యం ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి వార్త వినాల్సి వస్తోంది. అయితే భార్యను చంపిన భర్త అని లేదా భర్తను చంపిన భార్య అని.. తాజాగా మరో ఘటన సంచలనంగా మారింది. ఓ భార్య తన భర్తను కడతేర్చింది.
అన్నమయ్య జిల్లా గాలివీడు మండల కేంద్రంలోని చిలకలూరిపేటలో విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లలతో సహా తల్లి చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. చెరువుకట్ట పై నుంచి పిల్లలతో పాటు దూకి మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.
సీఎం జగన్ను చంపడానికే రాయి విసిరారని రిమాండ్ రిపోర్టులో కూడా రాసేశారు. దీంతో.. ఇప్పుడు ఈ వ్యవహారం అటు తిరిగి.. ఇటు తిరిగి తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోననే ఆందోళన టీడీపీ వర్గాల్లో పెరుగుతోందట. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద హత్యాయత్నం అంటే మామూలు విషయం కాదు. మొన్నటి వరకు నిందితుడి ఎవరో తెలీదు.. ఎవరో రాయి విసిరారు.. అది కూడా సరిగా కన్పించ లేదు... ఇదంతా ట్రాష్.. ఒట్టి డ్రామా అని కొట్టిపారేసిన టీడీపీ నేతల్లో..…