టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. అమెరికా నుంచి ఆంధ్రాకు వచ్చిన వాళ్లం విజయవాడ నుంచి తెనాలికి మాత్రం రాలేమన్నారు. గోతులతో నిండిన ఈ రోడ్లపై ప్రయాణించాలంటే ప్రాణాంతకంగా ఉందని ప్రభుత్వ తీరును ఆయన విమర్శించారు.
విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు గ్రామంలో గురువారం నాడు సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం ప్రసాదంపాడులోని టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీలోకి చేరికలు కొనసాగాయి.
గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి, అందిన సంక్షేమాన్ని చూసి ఒక్కసారి తనకు ఓటు వేస్తే.. ఐదేళ్లు ప్రజల కోసం పనిచేస్తానని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు అన్నారు.