బనగానపల్లె కోటపై టీడీపీ జెండా ఎగరడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్రెడ్డి.. నంద్యాల జిల్లాలో నామినేషన్ల పర్వం ఊపందుకోగా.. బనగానపల్లె నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డి.. గెలుపే దిశగా మరో ముందడుగు వేశారు.. ఈ రోజు కుటుంబసభ్యుల సమక్షంలో అత్యంత నిరాడంబరంగా నామినేషన్ దాఖలు చేశారు.. వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిని చిత్తుగా ఓడిస్తానన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
అమరావతిలో వైఎస్సార్సీపీలో భారీ చేరికలు కొనసాగుతున్నాయి. ఇటీవల ముస్లిం మైనారిటీ సోదరులు భారీ ఎత్తున పార్టీలో చేరగా.. ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి చెందిన 35 కుటుంబాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నాయి.
గన్నవరం నియోజకవర్గ ప్రజలు తనకు ఒక అవకాశం ఇచ్చి దీవిస్తే అభివృద్ధి పరంగా గన్నవరం రూపురేఖలు మారుస్తాను అని టీడీపీ- జనసేన- బీజేపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు.